https://oktelugu.com/

Wagon R Vs Tiago: వ్యాగన్ ఆర్ వర్సెస్ టియాగో.. ఎందుకు?

టాటా మోటార్స్ కు చెందిన కొన్ని మోడళ్లు మారుతి కంటే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చిన కొన్ని కార్లు మారుతి కార్ల కంటే బెస్ట్ ఫీచర్స్ తో పాటు సౌకర్యంగా ఉన్నాయని కొనియాడుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2024 / 03:37 PM IST

    Maruthi Wagon R Tata Tiago

    Follow us on

    Wagon R Vs Tiago:  దేశంలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకీ కంపెనీ. ఈ కంపెనీని బీట్ చేయడానికి ఎన్నో కంపెనీలో మార్కెట్లోకి వచ్చాయి. కానీ వినియోగదారులు మాత్రం మారుతి కార్లను ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే తాజాగా టాటా మోటార్స్ కు చెందిన కొన్ని మోడళ్లు మారుతి కంటే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చిన కొన్ని కార్లు మారుతి కార్ల కంటే బెస్ట్ ఫీచర్స్ తో పాటు సౌకర్యంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీటిలో ‘మారుతి’లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన వ్యాగన్ ఆర్ (Wagon R)కు , టాటా టియాగో(Tiagoz)మధ్య తీవ్రంగా పోటీ నడుస్తుందని చెబుతున్నారు. ఒకదశలో వ్యాగన్ ఆర్ వర్సెస్ టాటా టియాగో అన్నట్లుగా ఉందని అంటున్నారు. మరి ఈ రెండు కార్ల మధ్య ఉన్న వేరియేషన్ ఏంటో చూద్దాం..

    మారుతి వ్యాగన్ ఆర్ కారు 1 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి.వీటితో పాటు CNG ఎంపిక కూడా చేసుకోవచ్చు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను పరిశీలిస్తే 90 బీహెచ్ పీ పవర్ , 113ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేరస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు పెట్రోల్ పై 25.19 కిలోమీటర్లు, సీఎన్ జీపై 34.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ. 5.54 లక్షల ప్రారంభం నుంచి రూ.7.42 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వ్యాగన్ ఆర్ లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకర్షిస్తాయి.

    టాటా టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 86 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ పై లీటర్ కు 19 కిలోమీటర్లు, సీఎన్ జీ పై 26.49 కిలోమీటర్ల మైలేజ్ఇస్తుంది. దీనిని 5.60 లక్షల ప్రారంభ ధర ఉండగా టాప్ ఎండ్ 8.20 లక్షల వరకు విక్రయిస్తున్నారు. టాటా టియాగాలో 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫైటైన్మెంట్ సిస్టమ్, 8 స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ కూలింగ్ సౌకర్యంగా ఉంది.

    రెండు కార్ల మధ్య కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. వ్యాగన్ ఆర్ ధర విషయంలో కాస్త తక్కువగానే ఉంది. కానీ సేప్టీ విషయంలో వ్యాగన్ ఆర్ కంటే టాటా టియాగో బెస్ట్ అని అంటున్నారు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో వ్యాగన్ ఆర్ 1 స్టార్ రేటింగ్ పొందగా.. టియాగో 4 రేటింగ్ వచ్చింది. టియాగోలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, వెనుక పార్కింగ్, సెన్సార్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏఎంటీ వేరియంట్ 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకర్షిస్తాయి.