https://oktelugu.com/

Anil Ravipudi: ఆ సమయంలో ఈవీవీ గారు గుర్తొచ్చారు అంటున్న… దర్శకుడు అనిల్ రావిపూడి

Anil Ravipudi: మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు  అలరించారు ఈ దర్శకుడు. మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్నారు అనిల్. ఆ తర్వాత వచ్చిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ సినిమాలంటే కామెడీ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ రోజు దర్శకుడు అనిల్ రావిపూడి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 05:22 PM IST
    Follow us on

    Anil Ravipudi: మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు  అలరించారు ఈ దర్శకుడు. మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్నారు అనిల్. ఆ తర్వాత వచ్చిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ సినిమాలంటే కామెడీ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ రోజు దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

    ఈ సంధర్బంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అనిల్. నిజానికి ఎఫ్3 సినిమా చిత్రించాలి అనుకోలేదని, కాన్సెప్ట్ కుదరడం, అన్ని కలిసి రావడంతో ఎఫ్‌ 3’ మీద ఫోకస్ చేసాం అన్నారు. అలానే ఈ సినిమా పట్టాలెక్కించేందుకు వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా మరింత ఉత్సాహం చూపించారని తెలిపారు. అందుకే ఈ సినిమాతో ప్రేక్షకులను మరోసారి కడుపుబ్బ నవ్వించేందుకు రెడీ అయ్యామని వెల్లడించాడు. అదే విధంగా ఎఫ్ 3 సినిమా విషయంలో తనకు ఎదురైన కష్టం గురించి మనసులో మాట బయట పెట్టారు.

    ఈ సినిమాలో చాలా మంది కమెడియన్లు కనిపిస్తారని ఆ సమయంలో తనకి ప్రముఖ దర్శకుడు ఈవీవీ గారే గుర్తొచ్చేవారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఒకే సారి అంతా మంది కమెడియన్లను ఆయన ఎలా మానేజ్‌ చేశారో అని అనుకునే వాడినన్నారు. ఈ చిత్రంలో కూడా ఒక పాటలో తాను కనిపిస్తా అని తెలిపాడు. త్వరలోనే పాన్ ఇండియా సినిమా చేయడానికి మంచి కథ చూసుకుంటానని వివరించారు.