Champions Trophy 2025 (6)
Champions Trophy 2025: ఈసారి జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఏ, బీ గ్రూప్ లుగా ఐసీసీ విభజించింది.. ఈ ఎనిమిది జట్లలో ఐదుగురు ఆటగాళ్లు మాత్రం పరుగుల వరద పారించడం ఖాయం. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడ్ లో మ్యాచులు ఆడుతోంది.. అయితే పాకిస్తాన్, దుబాయ్ మైదానాలు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి.. ఈ ప్రకారం చూసుకుంటే టాప్ ఆటగాళ్లు పరుగుల సునామీని సృష్టించడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఐదుగురు ప్లేయర్లపై ప్రధానంగా అందరి దృష్టి ఉంది.
విరాట్ కోహ్లీ (Virat Kohli)
అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ జట్టుతో ఇటీవల జరిగిన మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు. కొద్దిరోజులుగా ఫామ్ లో లేని విరాట్ అహ్మదాబాద్ వన్డేలో 55 బంతులు ఎదుర్కొని 52 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతడు ఫామ్ లోకి రావడం భారత జట్టుకు ఒక రకంగా శుభవార్త. ఐసీసీ టోర్నమెంట్లలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గత వండి ప్రపంచకప్ లో ఏకంగా 765 పరుగులు చేసి.. హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. వన్డేలలో విరాట్ కోహ్లీ సాగటు 55 గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ పరుగుల వరద పారిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.
మహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ కెప్టెన్ గా ఉన్న ఈ ఆటగాడు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్ స్ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టిస్తాడని తెలుస్తోంది. పాకిస్తాన్ జట్టు తన గ్రూప్ మ్యాచ్లను న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో స్వదేశంలో ఆడనుంది. భారత జట్టుతో జరిగే మ్యాచ్ దుబాయిలో ఆడుతుంది.. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమిస్ గనుక వెళ్తే లాహోర్ లో ఆడుతుంది.. రిజ్వాన్ ఇటీవల జరిగిన ట్రై సిరీస్ లో 85.50 సగటుతో 171 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక గత ఏడాది నుంచి అతడు 12 మ్యాచ్లు ఆడగా, 62.14 సగటుతో 432 పరుగులు చేశాడు.. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రిజ్వాన్ బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ జట్టుకు కీలకం కానున్నాడు.
ట్రావిస్ హెడ్
దూకుడు అయిన బ్యాటింగ్ కు సిసలైన అర్థం చెప్పే ట్రావిస్ హెడ్.. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ అతడు ఆస్ట్రేలియా జట్టుకు ప్రస్తుత పరిస్థితుల్లో కీలక ఆటగాడు. 2023 వన్ డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా ట్రావిస్ హెడ్ నిలిచాడు. ప్రస్తుతం అతడు సూపర్ ఫామ్ లో లేకపోయినప్పటికీ చాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతాడని ఆస్ట్రేలియా అభిమానులు అంచనా వేస్తున్నారు.
కేన్ విలియంసన్
ఇటీవల ట్రై సిరీస్ ద్వారా కేన్ విలియంసన్ వన్డేలోకి వచ్చాడు. దాదాపు ఏడాది వరకు అతడు గ్యాప్ తీసుకున్నాడు. మూడు మ్యాచ్లలో 112.50 సగటుతో 225 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ.. ఒక హాఫ్ సెంచరీ ఉంది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో 113 పంతులు ఎదుర్కొని 133 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ జట్టును గెలిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు విలియంసన్ ఫామ్ లోకి రావడం న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్ లాంటిది. ఐసీసీ టోర్నమెంట్లలో విలియంసన్ కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పుడు కూడా విలియంసన్ ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడతాడని న్యూజిలాండ్ అభిమానులు అంచనా వేస్తున్నారు.
హెన్రిచ్ క్లాసెన్
సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ కు మెరుగైన రికార్డులే ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇతడు గనుక బ్యాట్ ను ఝుళిపిస్తే దక్షిణాఫ్రికా జట్టుకు తిరుగు ఉండదు. ఇక ఇటీవలి ట్రై సిరీస్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన హెన్రిచ్ క్లాసెన్ 87 పరుగులు చేశాడు. గత ఏడాది నుంచి నాలుగు బండిలలో 87.75 సగటుతో 351 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్రికా జట్టు మిడిల్ ఆర్డర్ కు హెన్రిచ్ క్లాసెన్ మూల స్తంభం లాగా ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. 2023 ప్రపంచ కప్ లో 41.44 సగటుతో హెన్రిచ్ క్లాసెన్ 300 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లో హెన్రిచ్ క్లాసెన్ టచ్ లోకి వస్తే దక్షిణాఫ్రికా జట్టుకు తిరుగుండదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: All eyes are mainly on these five players in the champions trophy 2025
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com