Vivo T5 Pro Vs OnePlus Nord CE6: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం ‘బిగ్ బ్యాటరీ’ విప్లవం నడుస్తోంది. రోజూవారీ అవసరాల్లో భాగంగా ఫోన్ వినియోగం ఎక్కువ అవడంతో చాలా మంది బ్యాటరీ బ్యాకప్ ఎక్కవ ఉండాలని అనుకుంటున్నారు. దీంతో పవర్‌ఫుల్ ఫీచర్లతో పాటు ఛార్జింగ్ ఎక్కువ కాలం రావాలనుకునే యూజర్ల కోసం ప్రముఖ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఈ రేసులో వివో (Vivo)కంపెనీ భారీ బ్యాటరీని అందించే సరొకొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇదే సమయంలో వన్ ప్లస్ కంపెనీ సైతం దీనితో పోటీ పడుతోంది. మరి ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్? ఏ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది?
Vivo తన సరికొత్త వివో T5 ప్రో ఫోన్‌ను ఇటీవల లాంచ్ చేసింది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రాబోతుంది. ఈ కొత్త ఫోన్ లో ఏకంగా 9020mAh భారీ బ్యాటరీని అమర్చారు. బ్యాటరీ పరంగా వివో T5 ప్రో మొబైలో ఉపయోగించిన నెక్స్ట్ జనరేషన్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వల్ల కేవలం 0.825 సెం.మీ సన్నని బాడీలోనే ఏకంగా 9020mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనికి గట్టి పోటీగా వన్‌ప్లస్ కూడా 8000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ CE6 ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రెండున్నర రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్‌లా (రివర్స్ ఛార్జింగ్) కూడా ఉపయోగపడుతుంది.
రెండు ఫోన్లు కూడా పవర్‌ఫుల్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. అలాగే అద్భుతమైన AMOLED డిస్ ప్లేలో భాగంగా 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తూ 144Hz హై రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటాయి. అయితే వివో T5 ప్రో ఫోన్ లో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్పష్టమైన స్క్రీన్‌ను అందిస్తుంది. కానీ వన్‌ప్లస్ నార్డ్ CE6 లో 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను మాత్రమే అందిస్తుంది. గేమింగ్ సమయంలో వేడిని తగ్గించడానికి వివోలో పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE6 వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, ముందు వైపు ఆటోఫోకస్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు, వెనుక కెమెరాల నుండి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో T5 ప్రో మొబైల్ లో కూడా 50MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, గూగుల్ జెమిని ఇన్-బిల్ట్‌గా వస్తాయి. అలాగే రెండు ఫోన్లకు అత్యంత కఠినమైన IP68 మరియు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉండటం విశేషం.
