Motorola Moto G77 Power: భారత మార్కెట్లో మిడ్ రేంజ్ మొబైల్స్ కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఇలాంటి వారికి అనుగుణంగా ఫోన్లను తీసుకువస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా మోటరోలా కంపెనీ సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయిన Moto G77 Power ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో అద్భుతమైన బ్యాటరీ లైఫ్, బడ్జెట్ ధరలో లభించే ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు ధర వివరాల్లోకి వెళితె..
మోటో G77 పవర్ ఫోన్ లో 6.72 అంగుళాల Full HD ప్లస్ LCD డిస్‌ప్లే ను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్ , గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉపయోగించారు. దుమ్ము, నీటి తుంపర్ల నుండి తట్టుకునేలా IP64 రేటింగ్‌తో డిజైన్ చేయబడింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 8GB RAMతో పాటు గరిష్టంగా 24GB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. ఇందులో 128GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉండగా, మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. దీని కోసం అడ్వాన్స్‌డ్ Sony LYTIA సెన్సార్‌ను ఉపయోగించారు. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను తీయగలదు. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీల కోసం మరియు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాల ద్వారా 2K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లోని అతిపెద్ద హైలైట్ దాని 7000mAh భారీ బ్యాటరీ ఉండగా.. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రెండు రోజుల పైనే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. భారత మార్కెట్లో మోటో G77 పవర్ స్మార్ట్‌ఫోన్ 8GB RAM ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ. 25,999గా ఉంది. ఇది పాంటోన్ ఇంపెనెట్రబుల్ (గ్రే), పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఫుచ్సియా రెడ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
