Used Cars Sale: కారులో తిరగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అనుగుణమైన బడ్జెట్ అందరికీ ఉండదు. ఈ తరుణంలో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి తమ కోరికను నెరవేర్చుకుంటారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో యూజ్డ్ కార్లకు బాగా డిమాండ్ పెరిగిపోతుంది. సెకండ్ హ్యాండ్ కార్లైనా ఎస్ యూవీలంటే తెగ లైక్ చేస్తున్నారు. వీటిలో ఉండే సౌకర్యాలతో పాటు విశాలమైన స్పేస్ కలిగి ఉండడంతో ఎస్ యూవీ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఎస్ యూవీల్లో ఏ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారంటే?
హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే ఎస్ యూవీల్లో ఉండే స్పెషిఫికేషన్స్, ఇంజిన్ తదితరు సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. అయితే కొత్త కారు కొనాలంటే మాత్రం కాస్త బడ్జెట్ ఉండాలి. అయితే ఇదే ఎస్ యూవీ లో ప్రయాణించాలని అనుకుంటే మాత్రం సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హ్యాండ్ కార్లలో హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాటిపై ఎక్కువగా మనసు పెడుతున్నారు. వీటిలో ఉండే ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
హ్యుందాయ్ క్రెటాలో 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్, 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ అనే రెండు ఇంజిన్లు ఉంటాయి. లీటర్ పెట్రోల్ కు 17.21 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ఓవరాల్ గా 115 బీహెచ్ పీ పవర్ తో పాటు 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎల్ ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ ఈడీ డీఆర్ఎల్ లు, ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్ ఈడీ కార్నరింగ్ ల్యాంప్స్, 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ కొత్త కారు రూ.11 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ 1.5 3 సిలిండర్ పెట్రోల్, 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్లు కలిగి ఉంది. ఇందులో 99.23 బీహెచ్ పీ పవర్ తో పాటు 215 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్ కు 14.7 నుంచి 21.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కొత్త కారు రూ.8.19 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ ఎకో స్పోర్ట్ కారు కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు తక్కువ ధరకు లభించడంతో దీనిపై మక్కువ చూపుతున్నారు.
సెకండ్ హ్యాండ్ కార్లలో హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కార్లు ఆధిపత్యం చూపిస్తున్నాయి. వీటి తరువాత స్విప్ట్, బ్రెజా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ 30 శాతం వృద్ధిని సాధించాయి. భారత్ లో కొచ్చి, జైపూర్, లక్నో వంటి నగరాల్లో యూజ్డ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.