https://oktelugu.com/

Mahesh Babu: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్న సుకుమార్… మహేష్ కి హిట్ ఇవ్వడమే ఆయన లక్ష్యమా..?

మొత్తానికైతే ఆయన అటెంప్ట్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇక ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ గా ఉన్న సుకుమార్ మహేష్ బాబు లాంటి హీరోకి మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2024 / 10:23 AM IST

    Sukumar aiming to give a hit for Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికీ ఒక విజన్, పర్ఫెక్షన్ ఉన్న దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అందులో ‘సుకుమార్ ‘ ఒకరు. ఆయన చేసిన ఆర్య సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా తనదైన రీతిలో డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ గా కూడా మిగిలాయి.

    ఇక మొత్తానికైతే ఆయన అటెంప్ట్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇక ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ గా ఉన్న సుకుమార్ మహేష్ బాబు లాంటి హీరోకి మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయాడు. ఆయన కాంబినేషన్ లో చేసిన వన్ సినిమా డిజాస్టర్ గా మిగలడం తో మళ్లీ మహేష్ బాబు తో ఒక సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలనే ఒక టార్గెట్ ను కూడా పెట్టుకున్నాడట. కానీ ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడం వల్ల సుకుమార్ తో సినిమా చేసే అవకాశాలు అయితే లేవు. కాబట్టి ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేసి అప్పుడు మహేష్ బాబు తో మరొక సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఆల్రెడీ మహేష్ బాబు తో చేసే సినిమా కోసం తను స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడట. ఇక ఆ స్టోరీలో మహేష్ బాబు ఒక వారియర్ గా కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి సుకుమార్ మహేష్ బాబు తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ రెండు నుంచి మూడు సంవత్సరాల కాలంలో రామ్ చరణ్ తో సినిమా చేసి మహేష్ బాబు తో ఒక భారీ విజువల్స్ తో ఒక పెద్ద సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఇలాంటి క్రమంలోనే సుకుమార్ మహేష్ బాబుకి సక్సెస్ ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆయన చేసిన స్టార్ హీరోలందరికీ మంచి సక్సెస్ ఇచ్చినప్పటికీ మహేష్ బాబుకి ఇవ్వలేకపోయాను అనే ఒక గిల్టీ ఫీల్ తో ఇప్పటికి బాధపడుతూ ఉంటాడట. ఈ విషయం గుర్తుకు వచ్చినప్పడు తనకి నిద్ర కూడా పట్టదట. ఇక అందుకే దాన్ని ఫుల్ ఫిల్ చేయడానికే మహేష్ బాబు తో మరో సినిమా చేస్తానని అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో సుకుమార్ చెప్పినట్టుగా తెలుస్తుంది…