https://oktelugu.com/

Credit Cards: క్రెడిట్ కార్డులను ఇలా వాడండి.. ప్రయోజనాలు మీరే చూస్తారు?

చేతిలో క్రెడిట్ కార్డు ఉండడంతో ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయద్దని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఏ కార్డులో ఎంత ఉంది? దాని పరిమితి ఎంత? అందులో ఏ అవసరానికి ఏది వాడితే కలిసి వస్తుంది ఒక ప్రణాళిక పెట్టుకోవాలి.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 14, 2024 / 04:15 PM IST

    Credit Cards

    Follow us on

    Credit Cards: ప్రస్తుత జనరేషన్ డిజిటల్ మనీ వైపునకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. బ్యాంకులు కూడా డిజిటల్ మనీకే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇవ్వడంతో పాటు అత్యవసరంగా డబ్బు కావాలంటే క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. కార్డులు చేతిలో ఉంటే భరోసా కూడా ఉంటుంది కదా? కానీ ఆదాయానికి మించి ఖర్చు ఎప్పుడూ భారమే కాబట్టి ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని డబ్బు ఖర్చు పెట్టాలి.

    చేతిలో క్రెడిట్ కార్డు ఉండడంతో ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయద్దని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఏ కార్డులో ఎంత ఉంది? దాని పరిమితి ఎంత? అందులో ఏ అవసరానికి ఏది వాడితే కలిసి వస్తుంది ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. బిల్లులు చెల్లించేందుకు, వినోదం, నిత్యావసరాల ఖర్చులు, ఇలా విడివిడిగా బడ్జెట్‌ పెట్టుకోవాలి. దాని ప్రకారమే వినియోగించుకోవాలి. మీకు నెలకు ఎంత మేరకు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. అప్పుడే చెల్లింపు సులభం అవుతుంది.

    * క్రెడిట్ కార్డుపై ప్రతీ లావాదేవీకి సంబంధించి మెసేజ్ వచ్చేలా చూసుకోవాలి.
    * బిల్లు చెల్లింపు గడువు కంటే వారం ముందే రిమైండర్ పెట్టుకోవాలి.
    * కార్డు పరిమితిని మించి వినియోగించినప్పుడూ అలర్ట్ మెసేజ్ లను పరిశీలించాలి.
    * రెండు, మూడు కార్డుల ఉంటే ‘క్రెడ్ యాప్’, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పేలో ఎంట్రీ చేసుకుంటే అవే వారం నుంచి మిమ్ములను అలెర్ట్ చేస్తాయి.
    * అకౌంట్లో డబ్బులు ఉంటే ఆటో డెబిట్ పెట్టుకుంటే సరిపోతుంది. దీని వల్ల ఫైన్ల బాధ తప్పుతుంది.
    * బిల్లు గడువు తేదీలోగా చెల్లించకుంటే క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుందని మరిచిపోవద్దు.
    * రెండు, మూడు వరకూ ఇబ్బంది లేదు. కానీ బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని అధికంగా తీసుకోవడం మంచిది కాదు.
    * కార్డులు ఎక్కువగా ఉంటే రుసుములు, ఇతర ఖర్చుల రూపంలో ఎక్కువ ఖర్చు చేసే వీలుంటుంది. చెల్లింపులు సమయానికి చేయకపోతే మీ లోన్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది.
    * క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్లను తప్పకుండా పరిశీలించాలి. అనధికార లావాదేవీలు ఉంటే కార్డు సంస్థకు విషయాన్ని తెలియజేయాలి.
    * క్రెడిట్‌ స్కోరును అప్పుడప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పేరుమీద కార్డులు, రుణాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటివి కనిపిస్తే క్రెడిట్‌ బ్యూరోలకు నివేదించాలి.
    * వీలైనంత వరకు క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి నగదును తీసుకోవద్దు. దీంతో అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు.
    * రుణాలు తీసుకునేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. క్రెడిట్‌ కార్డు నుంచి రుణం తీసుకుంటే దాదాపు 19-24 శాతం వడ్డీ పడుతుంది.
    * రివార్డు పాయింట్లను పరిశీలిస్తుండాలి. అధికంగా ఉంటే వినియోగించుకోవాలి. మనీ బ్యాక్, డిస్కౌంట్స్, రివార్డ్ కార్డ్స్ ఎలా ఉన్నాయో అవగాహన ఉండాలి.
    * కొనుగోళ్ల సమయంలో రివార్డు పాయింట్లను వ్యూహాత్మకంగా వాడాలి. రివార్డుల కోసం అంటూ ఎక్కువ ఖర్చు చేయద్దు.
    * క్రెడిట్‌ కార్డులకు ఫీజులు, వార్షిక రుసుములు ఉంటాయి. మీ వాడకాన్ని బట్టి కార్డును ఎంపిక చేసుకోవాలి. గొప్పలకు పోయి ఎక్కువ వార్షిక రుసుం ఉన్న కార్డును తీసుకుంటే ఇబ్బంది పడవచ్చు.
    * కార్డుపై ఉన్న పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా చూసుకోండి.

    వీటన్నింటిని గుర్తుంచుకుంటే క్రెడిట్ కార్డుల వల్ల నష్టపోకుండా ఆర్థికంగా ఫిట్ గా ఉండవచ్చు.