UPI : ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు జోరుగా సాగుతున్నాయి. 10 రూపాయల టీ నుంచి… వందల వేల బిల్లుల వరకు… యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) చిటికెలో ఆన్‌లైన్‌లో జరుగుతోంది. యూపీఐ లావాదేవీలు, విలువ ప్రతినెలా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలోని యూపీఐ సేవలు ఇప్పుడిప్పుడే వివిధ దేశాలకు విస్తరిస్తున్నాయి. విదేశాల్లో ఉంటూనే… ఇక్కడి భారతీయ కుటుంబాలకు లేదా భారత్ లో లావాదేవీలు జరపాలనుకునే వారికి కూడా యూపీఐ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మీకు దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌లో ఖాతా ఉంటే, మీరు రాబోయే రెండు రోజులు యూపీఐ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో యూపీఐ సేవలు పని చేయవు. ఈ సేవలు కొన్ని గంటల పాటు మూతబడనున్నాయి. ఆ తర్వాత అవి మునుపటిలా పని చేస్తాయి. యూపీఐ మాత్రమే కాకుండా మిగతావన్నీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారం హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది.
నవంబర్ 5, 23 తేదీలలో సిస్టమ్ నిర్వహణ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తెలిపింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ సేవలు నవంబర్ 5న 2 గంటలు, నవంబర్ 23, 2024న 3 గంటల పాటు అందుబాటులో ఉండవు. మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అవసరమైన సిస్టమ్ నిర్వహణను నిర్వహిస్తున్నామని బ్యాంక్ తెలిపింది.
ఆ సేవ అందుబాటులో ఉండదు
ఈ కాలంలో అనేక సౌకర్యాలు వినియోగదారులకు అందడం లేదు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలు లేదా రూపే క్రెడిట్ కార్డ్‌లపై ఫైనాన్స్, నాన్-ఫైనాన్స్ యూపీఐ లావాదేవీలు ఉండవు. హెచ్ డీఎఫ్ సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, GPay, WhatsApp Pay, Paytm, శ్రీరామ్ ఫైనాన్స్, MobiKwik, Credit.Payలో ఆర్థిక, ఆర్థికేతర హెచ్ డీఎఫ్ సీ లావాదేవీలు అనుమతించబడవు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌ని ఉపయోగించే బ్యాంక్ ఖాతాదారులందరికీ ఇది చెల్లుబాటు అవుతుంది. అదనంగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కొనుగోలు చేసిన వ్యాపారులకు సంబంధించిన అన్ని యూపీఐ లావాదేవీలు కూడా నిలిచిపోనున్నాయి.
యూపీఐ అంటే ఏమిటి?
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది స్మార్ట్‌ఫోన్ ఎనేబుల్డ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఇది బ్యాంక్ కస్టమర్‌లు ఒకే UPI IDని ఉపయోగించి డబ్బు చెల్లించడానికి/స్వీకరించడానికి అనుమతిస్తుంది. మీరు ‘UPI చెల్లింపులు’ కింద ‘లావాదేవీ చరిత్ర’ ట్యాబ్‌లో మీ గత లావాదేవీలను చూసుకోవచ్చు. ఇది నెట్‌బ్యాంకింగ్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Upi do you have an account in that bank but be careful upi services will be closed in november
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com