Homeహెల్త్‌Blue Tea : ఒక్కసారి ఈ బ్లూ టీ తాగితే.. లెక్కలెనన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ...

Blue Tea : ఒక్కసారి ఈ బ్లూ టీ తాగితే.. లెక్కలెనన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Blue Tea :  ఉదయం లేచిన వెంటనే టీ తాగకపోతే కొందరికి అసలు రోజూ కూడా గడవదు. సాధారణంగా ఎవరికైనా సూర్యోదయంతో డే స్టార్ట్ అయితే.. కొందరికి మాత్రం టీతోనే స్టార్ట్ అవుతుంది. టీ ప్రేమికులు రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో అసలు లెక్క ఉండదు. సమయం సందర్భం లేకుండా టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే ఈ టీలు ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే టీ, కాఫీలకు బదులు ఈ బ్లూ టీ తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువగా టీ, కాఫీ తాగడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి డైలీ బ్లూ టీని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఫిట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇంతకీ బ్లూ టీ ఏంటి? దీన్ని ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.

బ్లూ టీ అంటే శంఖం పువ్వులతో తయారు చేస్తారు. నీలం రంగులో ఉండే శంఖం పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. డైలీ ఈ టీని తాగడం వల్ల ఆరోగ్యం, చర్మం బాగుంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. సాధారణ టీ, కాఫీల కంటే శంఖం పువ్వులతో తయారు చేసిన టీ తాగడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కొందరు ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారు ఈ బ్లూ టీని తాగడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారు. వీటితో పాటు అలసట, నీరసం, ఒత్తిడి, డిప్రెషన్ సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజు ఈ టీని తాగడం వల్ల తొందరగా సమస్య నుంచి విముక్తి చెందుతారు. ఈ టీని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.

శంఖం పువ్వుల టీ తయారు చేయడం ఎలా?
శంఖం పువ్వులు టీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పువ్వుల మొక్కను ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు. ఇది తీగలా సాగే మొక్క. ఈ మొక్క ప్రతీ సీజన్‌‌లో కూడా పెరుగుతుంది. ఈ టీని తయారు చేయాలంటే రెండు గ్లాసుల నీటిలో ఐదు లేదా ఆరు శంఖం పువ్వులు వేసి మరిగించాలి. నీరు సగం అయిన తర్వాత పువ్వులను వేరు చేయాలి. అంతే ఇక బ్లూ టీ రెడీ. అవసరమైతే ఇందులో తేనె, నిమ్మరసం కలిపి కూడా తాగవచ్చు. మీకు ఎలా తాగితే టేస్ట్ అనిపిస్తుందో అలా తాగవచ్చు. డైలీ ఇలా తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular