Up Coming Cars : మీ పాత కారును మార్చి కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. అయితే కొంచెం ఆగండి. ప్రీమియం స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు వరకు.. మే నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కొత్త కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్‌లో కియా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, టాటా మోటార్స్ వంటి పెద్ద బ్రాండ్ల కార్లు ఉన్నాయి. ఏ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసుకుందాం.
1. కియా క్లావిస్ (Kia Clavis)
కియా సంస్థ కేరెన్స్ కొత్త వెర్షన్‌ను క్లావిస్ పేరుతో తీసుకురానున్నట్లు కన్ఫాం చేసింది. ఈ కారును మే 8న విడుదల చేయనున్నారు. ఈ కారు ధరను వచ్చే నెల జూన్ 2న వెల్లడిస్తారు. ఇటీవల కియా విడుదల చేసిన టీజర్‌ను చూస్తే, ఈ కొత్త ఎంపీవీలో సేఫ్టీ కోసం లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. దీంతో పాటు ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డ్రైవర్ కన్సోల్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ కొత్త కారును పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్‌లలో విడుదల చేయనున్నారు.
Also Read : బ్యాంక్ బ్యాలెన్స్ రెడీగా ఉంచుకోండి.. త్వరలో మార్కెట్లోకి 4కొత్త ఎలక్ట్రిక్ కార్లు
2. 2025 టాటా ఆల్ట్రోజ్ (2025 Tata Altroz)
టాటా మోటార్స్ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కంపెనీ ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఫీచర్లతో భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారును మే 21న భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డీజిల్ ఇంజన్‌తో వస్తున్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ ఇదే.
3. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI (Volkswagen Golf GTI)
పోలో GTI తర్వాత, ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో తన రెండవ GTI మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ కొత్త మోడల్ త్వరలో మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి రాబోతోందని కన్ఫాం చేసింది. ఈ కారు లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు.. కానీ మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండవచ్చు, ఇది 261bhp పవర్, 370Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
4. MG విండ్‌సర్ EV లాంగ్ రేంజ్ (MG Windsor EV Long Range)
MG కంపెనీ ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి మార్కెట్‌లో సందడి చేస్తోంది. కంపెనీ అమ్మకాలను పెంచడంలో ఈ కారు కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మీడియా నివేదికల ప్రకారం.. మే నెలలో ఈ కారు లాంగ్ రేంజ్ వేరియంట్‌ను 50.6kWh బ్యాటరీ ఆప్షన్‌తో విడుదల చేయవచ్చు.
Also Read : కొత్త ఎస్యూవీ కొనాలని చూస్తున్నారా..అయితే త్వరలో రాబోతున్న ఫ్యామిలీ కార్లు ఇవే