Kia Sonet : సెల్టోస్ ఎస్‌యూవీతో ఇండియాలోకి అడుగుపెట్టిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏప్రిల్ 2025 నెలలో ఏకంగా 23,623 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే నెలలో నమొదైన 19,968 యూనిట్ల కంటే 18.3 శాతం ఎక్కువ. ఇక్కడ విశేషం ఏమిటంటే.. గత నెలలో కియా అత్యధికంగా అమ్ముడైన కారు సబ్-కాంపాక్ట్ SUV అయిన సోనెట్. సోనెట్ ఏకంగా 8,068 యూనిట్ల అమ్మకాలతో టాప్ ప్లేసులో నిలిచింది. ఆ తర్వాత సెల్టోస్ 6,135 యూనిట్లు, కేరెన్స్ 5,259 యూనిట్లు, ఇటీవల విడుదలైన సిరోస్ 4,000 యూనిట్ల అమ్మకాలతో కంపెనీకి తన వంతు సహకారం అందించాయి. ఇకపోతే, కియా ప్రీమియం ఎంపీవీ కార్నివాల్ లిమోసిన్‌ను కేవలం 161 మంది మాత్రమే కొనుగోలు చేశారు.
కియా సోనెట్ ఒక స్టైలిష్, ఫీచర్-లోడెడ్ సబ్-4 మీటర్ SUV. ఇది కియా సిరోస్ కంటే దిగువన బ్రాండ్ లైనప్‌లో వస్తుంది. పవర్ ఫుల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పాటు అనేక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కూడా ఇది అందుబాటులో ఉంది. మోడ్రన్, బడ్జెట్, డ్రైవ్ చేయడానికి సరదాగా ఉండే సబ్-కాంపాక్ట్ SUV కోసం చూస్తున్న పట్టణ కొనుగోలుదారులకు సోనెట్ ఒక మంచి ఆప్షన్. అయితే, పై సెగ్మెంట్ నుంచి పవర్‌ట్రెయిన్, ఫీచర్లను తీసుకోవడం వల్ల ఇది కొంచెం ఖరీదైనదిగా మారింది. క్యాబిన్ ఇన్సులేషన్ అంతగా మెరుగ్గా లేదు. స్పోర్ట్ మోడ్‌లో టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వెనుక సీట్లలో మెరుగైన కుషనింగ్, ఎక్కువ స్పేస్ ఉంటే బాగుండేది. మార్కెట్‌లో సోనెట్ మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, రెనో కైగర్‌లకు గట్టి పోటీని ఇస్తోంది.
Also Read : కొత్త రికార్డు సృష్టించిన ‘కియా’..
కియా సోనెట్ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.8 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ ధర రూ.15.60 లక్షల వరకు ఉంటుంది. సోనెట్ 18 వేరియంట్లలో అందుబాటులో ఉంది. సోనెట్ బేస్ మోడల్ HTE, టాప్ మోడల్ కియా సోనెట్ GTX ప్లస్ డీజిల్ AT. సోనెట్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని టాప్-ఎండ్ మోడల్‌లో అనేక రకాల ఫీచర్లు, టెక్నాలజీ ఉన్నాయి. ఇందులో పెద్ద ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సేఫ్టీ ఫీచర్ల సెట్, అనేక రకాల ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ADAS, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి.
Also Read : కియా సోనెట్ కొత్త మోడల్ చూశారా? ఫీచర్స్ అదిరిపోయాయి..