NTR: ఎన్టీయార్ ఆర్ట్ సినిమా చేస్తే కమలహాసన్ ను మించి పోతాడా..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ సైతం ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By: Gopi, Updated On : May 11, 2024 2:49 pm

If NTR does a art film, will he surpass Kamal Haasan

Follow us on

NTR: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఆర్ట్ సినిమాలు చేయాలంటే అది ఒక కమల్ హాసన్ వల్లే అవుతుంది అంటూ చాలామంది కమలహాసన్ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు.నిజానికి కమలహాసన్ కూడా అప్పట్లో వరుసగా ఆర్ట్ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆయనను మించి వేరే వాళ్ళు చేసిన కూడా ఆ సినిమాలు వర్కౌట్ అయ్యేవి కావు. ముఖ్యంగా సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం లాంటి సినిమాలు ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలనే చెప్పాలి…

ఇక ఇలాంటి సినిమాలతోనే ఆయన ‘లోక నాయకుడి’ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మిగిలిన హీరోలందరూ కమర్షియల్ ఫార్మాట్ ని ఎంచుకొని ముందుకు సాగుతుంటే ఆయన మాత్రం అందరికీ డిఫరెంట్ వేలో ‘ కళాత్మకమైన ‘ సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ సైతం ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్ సినిమా కనక చేయగలిగితే కమలహాసన్ ను మించి నటించగలరు అని కొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్టీఆర్ కి ఉన్న స్టార్ట్ డమ్ ను పక్కనపెట్టి ఆర్ట్ సినిమా చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పనే.. అది కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కమలహాసన్ తో పోటీ పడటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని మరికొంత మంది వాళ్ల అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ మాత్రం కమలహాసన్ కి ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా నటించి మెప్పిస్తాడు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీయార్ తన కెరియర్లో ఒక్కసారి అయిన ఆర్ట్ సినిమా చేస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు…