https://oktelugu.com/

Shekar Master: శేఖర్ మాస్టర్ పై మహిళా కమీషన్ ఫైర్..హద్దులు మీరుతున్న హుక్ స్టెప్స్!

ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ పాటలకు వందల కొద్దీ మిలియన్ వ్యూస్ రావడం చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాదు. మీడియం రేంజ్ హీరోలకు, అసలు ఊరు పేరు తెలియని హీరోల సినిమాలకు కూడా 100 మిలియన్ వ్యూస్ సర్వసాధారణం అయిపోయింది. పాట యావరేజ్ రేంజ్ లో ఉన్నా పర్వాలేదు, సరైన హుక్ స్టెప్స్ ఉంటే చాలు, ఆకాశమే హద్దు అనే రేంజ్ లో రీచ్ వస్తున్న రోజులవి.

Written By: , Updated On : March 20, 2025 / 11:23 PM IST
Follow us on

Shekar Master: ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ పాటలకు వందల కొద్దీ మిలియన్ వ్యూస్ రావడం చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాదు. మీడియం రేంజ్ హీరోలకు, అసలు ఊరు పేరు తెలియని హీరోల సినిమాలకు కూడా 100 మిలియన్ వ్యూస్ సర్వసాధారణం అయిపోయింది. పాట యావరేజ్ రేంజ్ లో ఉన్నా పర్వాలేదు, సరైన హుక్ స్టెప్స్ ఉంటే చాలు, ఆకాశమే హద్దు అనే రేంజ్ లో రీచ్ వస్తున్న రోజులవి. హుక్ స్టెప్స్ కి మంచి డిమాండ్ ఉండడం తో కొంతమంది కొరియోగ్రాఫర్స్ ఇష్టమొచ్చినట్టు హుక్ స్టెప్పులు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Shekar Master) తన పాటల్లో పెట్టే హుక్ స్టెప్స్ ఇప్పుడు వివాదాస్పదం గా మారాయి. ప్రతీ సినిమాలోనూ ఆయన అసభ్యకరమైన హుక్ స్టెప్స్ ని కంపోజ్ చేస్తున్నాడు. శేఖర్ మాస్టర్ చేస్తున్నాడు కదా, మేము కూడా అలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తామని మిగిలిన కొరియోగ్రాఫర్స్ కూడా అదే ఫార్ములా ని అనుసరిస్తున్నారు.

దీంతో యూత్ ఆడియన్స్ బాగా చెడిపోతున్నారని ఈమధ్య ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రంలోని ‘అదిదా సర్ప్రైజ్'(Adidha Surprise) అనే పాట వివాదాస్పదంగా మారింది. కొన్ని స్టెప్పులు చూసేందుకు చాలా అసహ్యంగా ఉన్నాయని విమర్శలు వినిపించాయి. దీనిపై ఇప్పుడు మహిళా కమీషన్ కూడా రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే మార్చాల్సిందిగా మేకర్స్ కి నోటీసులు జారీ చేసింది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఆ స్టెప్పులను కొత్తగా రీ కంపోజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే విడుదల రోజు లిరికల్ వీడియో చూపించిన స్టెప్పులు మనం థియేటర్స్ లో చూడలేము అన్నమాట. ఇది మూవీ టీం కి పెద్ద షాక్ అనే చెప్పాలి.

హుక్ స్టెప్పులు కంపోజ్ చేయడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ అసభ్యకరంగా ఉండకూడదు అనేది పలువురి వాదన. ఉదాహరణకు ‘బుట్ట బొమ్మ’ పాటలో హుక్ స్టెప్స్ దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో మనమంతా చూసాము. అందులో ఏమైనా అసభ్యత ఉందా?, ఎలా అంతటి హిట్ అయ్యింది?, అదే విధంగా రీసెంట్ గా విడుదలైన ‘కోర్ట్’ చిత్రంలోని ‘ప్రేమలు’ పాటలోని హుక్ స్టెప్ కూడా ఎంత పాపులర్ అయ్యిందో మనమంత చూసాము, సినిమా మీద అంచనాలు పెంచేలా చేసింది. ఇక రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ లోని ‘కొల్లగొట్టినాదిరో’ పాటలోని హుక్ స్టెప్ లో కూడా ఎలాంటి అసభ్యత లేదు, అది కూడా పెద్ద హిట్ అయ్యింది కదా. శేఖర్ మాస్టర్ ఇక నుండి అలాంటి హుక్ స్టెప్స్ ని డిజైన్ చేస్తాడని, అసభ్యంగా ఉండే హుక్ స్టెప్స్ కి దూరంగా ఉంటాడని ఆశిద్దాం.