Homeబిజినెస్TVS Jupiter sales: ఒకే నెలలో లక్షకు పైగా అమ్మకాలు.. ఎగబడి మరీ కొంటున్నారు.. ఈ...

TVS Jupiter sales: ఒకే నెలలో లక్షకు పైగా అమ్మకాలు.. ఎగబడి మరీ కొంటున్నారు.. ఈ స్కూటర్లో ఏముంది?

TVS Jupiter sales: భారతీయ మార్కెట్లో ప్రస్తుతం బైక్స్ కంటే స్కూటర్లకే ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. రోజువారి వినియోగదారులతో పాటు నగరాల్లో ఉండేవారు ఈ స్కూటర్లతో ప్రయాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా దీనిపై డ్రైవింగ్ ఉండటంతో చాలామంది దీనిపై ఆసక్తి చెబుతున్నారు. ఇందులో భాగంగా వీటి అమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 2026 స్కూటర్ల అమ్మకాల్లో TVS కంపెనీ తన సత్తా చూపినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన Jupiter ఈ నెలలో 1,27,089 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. ఓకే నెలలో లక్షకు పైగా అమ్మకాలు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో రకాల స్కూటర్లు రిలీజ్ అవుతున్న తరుణంలో జూపిటర్ పై ఎక్కువగా ఆదరణ చూపడం హర్షించదగ్గ విషయం అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అసలు ఈ స్కూటర్ ఇంతలా కొనడానికి గల కారణం ఏంటంటే?

TVS కంపెనీకి చెందిన జూపిటర్ రోజువారి వినియోగదారులకు ఎంతో అనుగుణంగా ఉంటుంది. అలాగే నగరాల్లో ఉండేవారు దీనిపై రైడ్ చేస్తే స్టైలిష్ గా కనిపిస్తారు. ఈ స్కూటర్ లో 113.3 సిసి ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన్ లాంగ్ డ్రైవ్ చేస్తే 50 నుంచి 57 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. లోకల్ ప్రయాణికులకు 53.84 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం జూపిటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 113.3 సీసీ ఇంజన్ కాగా.. మరొకటి 124.76 ఇంజన్ ఉండనుంది. మొదటి ఇంజన్ కలిగిన స్కూటర్ ధర రూ.72,400 తో ప్రారంభమవుతుంది. రెండో ఇంజన్ స్కూటర్ రూ.80,050 తో కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఈ కారులో గ్యాస్ ఇంజన్ తో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్.. డ్రైవర్లకు ఫుల్ సపోర్ట్..

ఇది రోజువారి ప్రయాణికులతో పాటు యూత్ ను కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే స్టైలిష్ గా ఉండే స్కూటర్లలో జుపిటర్ కూడా ఒకటి. దీనికి ఉండే ఎల్ఈడి ల్యాంప్స్, బ్లాక్ ఫినిషింగ్, అందంగా కనిపించే బాడీ ఉండడంతో దీనిపై రైడ్ చేస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాగే ఇందులో ఫీచర్స్ కూడా నేటి తరం వారికి అనుగుణంగా ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్సిడి స్పీడోమీటర్, 34 లీటర్ల బూట్ స్పేస్ సామర్థ్యం వంటివి ఉండడంతో రోజువారి వినియోగదారులు తమ వస్తువులను తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే సేఫ్టీ కోసం కాంబో బ్రేకింగ్ సిస్టం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంటాయి. అలాగే ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టం, యు ఎస్ బి చార్జర్ వంటివి సౌకర్యాలను అందిస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version