Homeబిజినెస్Nissan e Power hybrid technology: ఈ కారులో గ్యాస్ ఇంజన్ తో ఎలక్ట్రిక్ పవర్...

Nissan e Power hybrid technology: ఈ కారులో గ్యాస్ ఇంజన్ తో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్.. డ్రైవర్లకు ఫుల్ సపోర్ట్..

Nissan e Power hybrid technology: ఇప్పటివరకు హైబ్రిడ్ కార్లను చూశాం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేశాం.. కానీ ఒకే కారులో హైబ్రిడ్ ఇంజన్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉండడం చాలా అరుదు. అంతేకాకుండా ఇందులో ఉండే ఎలక్ట్రిక్ పవర్ చార్జర్ తో కాకుండా ఆటోమేటిక్ గా చార్జ్ చేసుకోవడం విశేషం. ఇలాంటి కారు ఇప్పుడు అమెరికా మార్కెట్లోకి రాబోతుంది. ఈ కారు ఇప్పటికే రోడ్లపై తిరుగుతుంది. అయితే దీనిని ఈ రకంగా అప్డేట్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇది పైకి కనిపించే గ్యాస్ కారు అయినప్పటికీ లోపల మాత్రం ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా పనిచేస్తుంది. దీంతో ఇలాంటి కారు కొనుగోలు చేయడం వల్ల అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా పూర్తిగా భిన్నమైన ఇంజన్ ఉండడంతో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ ఇది ఏ కంపెనీ కారు? ఇందులో ఉండే ఈ ఇంజన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

ప్రముఖ కార్ల కంపెనీ Nissan 2016లో జపాన్ లో ఈ -పవర్ అనే కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 70 దేశాల్లో 1.6 మిలియన్లకు పైగా దీనిని విక్రయించారు. అయితే ఈ కారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంది. ఈ కారులో గ్యాస్ ఉన్నప్పటికీ ఇది ట్రాన్స్మిషన్ లో భాగంగా ఆల్ వీల్ ఎలక్ట్రిక్ కారు గా మారిపోతుంది. ఇందులో బ్యాటరీ చిన్నదిగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ప్లగ్ పెట్టి చార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. హైబ్రిడ్ ఇంజన్ నుంచి ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తినిచ్చే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. పెరుగుతున్న గ్యాస్ ధరలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా కోరుకుంటున్న తరుణంలో ఇలాంటి కారును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: హైబ్రిడ్ ఇంజన్..7 సీటర్.. వీటి గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

ఈ ఏడాది చివరిలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. నిస్సాన్ ఇ పవర్ నుంచి రిలీజ్ అవుతున్న మూడో తరం కారు ఇది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టయోటా ప్రియస్ వంటి వాహనాలకు భిన్నంగా ఇందులో హైబ్రిడ్ వ్యవస్థ తో పాటు ఎలక్ట్రిక్ కూడా ఉండడంతో చాలామంది దీనిని ఆదరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిస్సాన్ రోగ్ వంటి వాహనాల కంటే ఎక్కువగా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రోజువారీ వినియోగదారులతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రైవర్లకు గ్యాస్ కొరత ఉన్న సమయంలో వెంటనే ఎలక్ట్రిక్ వేరియంట్ ను ఉపయోగించుకొని ప్రయాణాలు సాగించవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version