Homeఆంధ్రప్రదేశ్‌North Andhra benefits: నియోజకవర్గాల పెంపు.. ఉత్తరాంధ్రలో కొత్త లెక్కలు!

North Andhra benefits: నియోజకవర్గాల పెంపు.. ఉత్తరాంధ్రలో కొత్త లెక్కలు!

North Andhra benefits: ఇప్పుడు అంతటా నియోజకవర్గాల పునర్విభజన పై చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్నట్లు ఎన్డీఏ సమావేశంలో కేంద్ర పెద్దలు స్పష్టతనిచ్చారు. ఏకంగా 50% సీట్లు దేశవ్యాప్తంగా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో 88 అసెంబ్లీ సీట్లు.. ఓ 13 వరకు ఎంపీ సీట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. రాజకీయ ఆశావహులతో పాటు వారసుల్లో ఇప్పుడు అంచనాలు పెరుగుతున్నాయి. ఏ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయో అన్నదానిపై చాలా రకాల చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి? ఎక్కడెక్కడ పెరుగుతాయి? అనే అంశాలపై చర్చిస్తున్నారు ఎక్కువమంది.

భారీగా పెరగనున్న నియోజకవర్గాలు..
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9, శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి, అరకు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే పునర్విభజనతో ఉత్తరాంధ్రలో ఓ 17 వరకు నియోజకవర్గాలు పెరగవచ్చు అన్నది ఒక అంచనా. ఈ లెక్కన 51 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు చేరుకోవచ్చు. మరోవైపు రెండు పార్లమెంట్ సీట్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఆశావహులకు ఇదో చక్కటి అవకాశం. ఉత్తరాంధ్రలో పార్టీలు దక్కించుకునే దాన్ని బట్టి అధికారంలోకి వస్తాయి. ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టనున్నాయి.

Also Read: నియోజకవర్గాల పునర్విభజన.. ఏపీలో మహిళల నియోజకవర్గాలు ఇవే!

ఉమ్మడి జిల్లాల వారీగా లెక్క..
విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మరో ఎనిమిది నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు విజయనగరంలో 9 అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మరో నాలుగు పెరిగే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మరో ఐదు వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మూడు జిల్లాలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలం. ఇప్పుడు టిడిపికి జనసేనతో పాటు బిజెపి సహకారం ఉండడంతో నియోజకవర్గాల పెంపు అనేది కూటమికి ప్రయోజనం అని విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో రాజకీయ వారసులు చాలామంది ఉన్నారు. వారంతా పోటీ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాలు భారీగా పెరుగుతుండడంతో వారికి ఆశలు చిగురిస్తున్నాయి. పునర్విభజనను వారు స్వాగతిస్తున్నారు. అయితే పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టడంతో నేతలు సైతం తమకు అనుకూలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకునే పనిలోపడ్డారు. సామాజిక లెక్కలు వేసుకుని ఫలానా మండలాలతో కొత్త నియోజకవర్గ ఏర్పాటు అవుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version