Gold Investment: దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో మాత్రం బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ సంక్షోభాలు ఎదురైన సమయంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉండదని ఎక్కువమంది అభిప్రాయపడతారు. అయితే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్‌ను జారీ చేస్తుండగా ఇందులో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బంగారం స్వచ్ఛతకు హామీ లభించడంతో పాటు రుణాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి ఇందుకు సంబంధించి వడ్డీ లభించడం జరుగుతుందని చెప్పవచ్చు.
ఆన్‌లైన్ స్టాక్ బ్రోకర్ సహాయంతో గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. షేర్ రూపంలో కూడా వీటిని కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రోజంతా గోల్డ్ ఈటీఎఫ్ లు ట్రేడ్ అవుతాయి కాబట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. ఎక్స్ఛేంజీల సహాయంతో గోల్డ్ ఈటీఎఫ్ లను విక్రయించే అవకాశం ఉంటుంది. డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయాలని అనుకుంటే మాత్రం ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్లు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. ఇందులో కొనుగోలు చేసిన బంగారంను నిల్వ చేసే ఛాన్స్ ఉంటుంది. బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు డిజిటల్ గోల్డ్ బెస్ట్ అని చెప్పవచ్చు.