https://oktelugu.com/

పాత వాహనాలు నడిపేవాళ్లకు షాక్.. రూ.10 వేల జరిమానా!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పర్యావరణ కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. మోదీ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం స్క్రాపేజ్ పాలసీని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్క్రాపేజ్ పాలసీని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఎవరైతే పాత వాహనాలను వినియోగిస్తున్నారో వాళ్లు కొన్ని నిబంధనలను గుర్తుంచుకుంటే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ఆవిష్కరించడం గమనార్హం. 15 సంవత్సరాల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 17, 2021 / 08:30 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పర్యావరణ కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. మోదీ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం స్క్రాపేజ్ పాలసీని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్క్రాపేజ్ పాలసీని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఎవరైతే పాత వాహనాలను వినియోగిస్తున్నారో వాళ్లు కొన్ని నిబంధనలను గుర్తుంచుకుంటే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.

    ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ఆవిష్కరించడం గమనార్హం. 15 సంవత్సరాల నాటి పెట్రోల్ వాహనాలతో పాటు 10 సంవత్సరాల డీజిల్ వాహనాలపై ఢిల్లీలో నిషేధం అమలులోకి వచ్చింది. రోడ్లపైకి పాత వాహనాలు వస్తే ఏకంగా 10,000 రూపాయల జరిమానా చెల్లించాలి ఉంటుంది. పాత వాహనాలను నడిపితే ఎవరైనా జరిమానా కట్టాల్సిందేనని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించడం గమనార్హం.

    రోడ్డుపై పాత వాహనాలు కనిపిస్తే ఆ వాహనాలను ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ స్క్రాపేజ్ సెంటర్ కు పంపించే అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురాగా త్వరలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ నిబంధనలను అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే స్క్రాపేజ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.

    మరోవైపు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లకు సంబంధించిన వ్యాలిడిటీని పొడిగించింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించడం గమనార్హం.