https://oktelugu.com/

Aamir Khan : మాజీ భర్త మూవీ ప్లాప్ చేసింది నేను అంటున్న స్టార్ హీరో ఎక్స్ వైఫ్… సంచలనం రేపుతున్న కామెంట్స్

లాపతా లేడీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫలితం గురించి డైరెక్టర్ కిరణ్ రావు స్పందించింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఒక రకంగా చెప్పాలంటే ధోభీ ఘాట్, లాపతా లేడీస్ ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడ్డాయి. మెరుగైన ఫలితాలు రాబట్టలేక పోయాయని ఆమె చెప్పుకొచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 25, 2024 / 07:02 PM IST
    Follow us on

    Amir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా లాపతా లేడీస్. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 27. 66 కోట్లు రాబట్టింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అనంతరం ఈ సినిమా ఓటీటీ లోకి ఎంటర్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లాపతా లేడీస్ దుమ్మురేపుతుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.

    బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ ని సైతం దాటేసి అత్యధిక వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం లాపతా లేడీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫలితం గురించి డైరెక్టర్ కిరణ్ రావు స్పందించింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఒక రకంగా చెప్పాలంటే ధోభీ ఘాట్, లాపతా లేడీస్ ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడ్డాయి. మెరుగైన ఫలితాలు రాబట్టలేక పోయాయి.

    పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన దోబీ ఘాట్ మూవీకి ఆ కాలంలో ఓ మోస్తరు బిజినెస్ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన లాపతా లేడీస్ ఆ సినిమా కంటే వెనుక పడిపోయింది. అంటే ఒక రకంగా ప్లాప్ అయినట్లేగా .. కలెక్షన్ల పరంగా చూసినా సక్సెస్ కాలేకపోయింది. వందల కోట్లు కాదు కదా కనీసం రూ. 30 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఫలితాలు ఇలా రావడానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పుకొచ్చింది.

    ఇక చిత్రాన్ని అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే, కిరణ్ రావు నిర్మించారు. నీతషి గోయల్, ప్రతిభ రంత, స్పర్ష్ శ్రీవాత్సవ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా కిరణ్ రావ్ ని అమిర్ ఖాన్ 1986లో రీనా దత్తను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. జునైద్ ఖాన్ ఇటీవల మహరాజ్ మూవీతో హీరోగా మారాడు. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

    రీనా దత్తకు 2002లో అమిర్ ఖాన్ విడాకులు ఇచ్చారు. అనంతరం 2005లో కిరణ్ రావుని అమిర్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. కిరణ్ రావు లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం. వీరికి ఒక అబ్బాయి సంతానం. ఆజాద్ రావ్ ఖాన్ అని పేరు పెట్టారు. అనూహ్యంగా 2021లో అమిర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల ప్రకటన చేశారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. పరస్పర అవగాహనతో విడిపోతున్నామని చెప్పొకొచ్చారు.

    విడాకులు తీసుకున్నప్పటికీ అమిర్ ఖాన్, కిరణ్ రావు అన్యోన్యంగానే ఉంటున్నారు. వీరే కలిసే జీవిస్తున్నట్లు సమాచారం. కిరణ్ రావు, అమిర్ ఖాన్ తరచుగా మూవీ ఈవెంట్స్ లో కనిపిస్తారు. అలాగే ఇద్దరు కలిసి పిల్లలతో విహారాలకు చెక్కేస్తారు. అమిర్ ఖాన్ కెరీర్ ఈ మధ్య డల్ అయ్యింది. ఆయన గత చిత్రం లాల్ సింగ్ చద్దా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    1996లో వచ్చిన ఫారెస్ట్ గంప్ చిత్రానికి ఇది రీమేక్. ఇండియన్ ఆడియన్స్ లాల్ సింగ్ చద్దా చిత్రానికి ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. లాల్ సింగ్ చద్దా ఫలితం అనంతరం అమిర్ ఖాన్ కొంత బ్రేక్ తీసుకున్నాడు. కొన్నాళ్ళు సినిమాలు చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు.