Toyota Sienna Hybrid: కారులో ప్రయాణించాలని ఎవరికైనా ఉంటుంది. అయితే కొందరు కార్లలో తిరగాలని ఉంటుంది. ప్రీమియం కార్లను అందించడంలో Toyota ప్రత్యేకతను కలిగి ఉంటుంది. 2026 సంవత్సరానికి టయోటా కంపెనీ హైబ్రిడ్ పవర్ ఇంజన్ కలిగిన మినీ వ్యాన్ లాంటి ఓ కారును ప్రవేశపెట్టింది. ఇది చూడడానికి కారే అయినా.. ఇందులో ప్రయాణం చేస్తే స్వర్గంలో ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. లగ్జరీ కారు కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అయితే ఇందులో ఉండే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Toyota Sienna కారు గురించి ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే 2026 సంవత్సరానికి ఈ కంపెనీ హైబ్రిడ్ పవర్ తో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఇంధన సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2.5 లీటర్ సిలిండర్ ఇంజన్ కలిగిన ఇది 245 సిస్టం హార్స్ పవర్ తో కలిపి 36 MPG వరకు పవర్ అందిస్తుంది. నగరాల్లో ప్రయాణం చేసే వారితోపాటు లాంగ్ డ్రైవ్ చేసే వారికి ఇందులో ఉండే AWD మోడల్స్ అకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ విల్ డ్రైవ్ తో హైబ్రిడ్ వ్యవస్థ పని చేస్తుంది.
ఈ కారులో స్మార్ట్ ఫీచర్స్ నేటి తరం వారికి అనుగుణంగా ఉంటుంది. కొత్తగా కారులో ఎంజాయ్ చేయాలని అనుకునేవారు ఈ ఫీచర్స్ తో గొప్ప అనుభూతి పొందుతారు. ఈ కారులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం స్క్రీన్, ట్వెల్ స్పీకర్, JBL ఆడియో సిస్టం ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే 1500 W పవర్ ఇన్వెస్టర్ ను చూడొచ్చు. ఇది కొన్ని కార్లలో మాత్రమే కనిపిస్తుంది. సేఫ్టీ విషయంలోనూ ఈ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో మొత్తం 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు బూట్ స్పేస్ ఎక్కువగా ఉంచారు. అలాగే ప్రీ కొలెక్షన్ సిస్టం, లేని డిపార్చర్ అలర్ట్ వంటివి భద్రతను అందిస్తాయి.
టయోటా Sienna హైబ్రిడ్ కారులో ప్రయాణం చేస్తే స్వర్గంలో వెళ్లినట్లు ఉంటుంది. దీని డిజైన్ చూస్తే ఇంప్రెస్ కలుగుతుంది. మినీ వ్యాన్ వలె ఉంటుంది. కానీ బాక్స్ డిజైన్ మాత్రం కాదు. స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్ తో పాటు ఆకర్షణీయమైన హెడ్ లాంప్స్, క్లీన్ బాడీ లైన్ అందాన్ని తీసుకొస్తాయి. అలాగే స్లైడింగ్ డోర్లు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయి. డిజైన్ మాత్రమే కాకుండా ఇది ఆకర్షణీయమైన రంగుల్లో కూడా అందుబాటులో ఉంది. రోజువారి జీవితంలో భాగంగా ప్రీమియం కార్లలో తిరగాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. దీని ధర 41,615 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ కారు 52,300 డాలర్లతో విక్రయిస్తున్నారు.