Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Shoulder Surgery: పవన్ కళ్యాణ్ కుడి భుజం సర్జరీ కి ఎంత ఖర్చు...

Pawan Kalyan Shoulder Surgery: పవన్ కళ్యాణ్ కుడి భుజం సర్జరీ కి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..? ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనేయొచ్చు..

Pawan Kalyan Shoulder Surgery: ఎన్నో ఏళ్ళ నుండి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ని వెంటాడుతున్న భుజాల నొప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసుకోవడం కోసం , రీసెంట్ గానే ముంబై కి వెళ్లి అంబానీ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, కేవలం మూడున్నర గంటల్లోనే పవన్ కళ్యాణ్ కి సర్జరీ పూర్తి చేశారు వైద్యులు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఆ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. […]

Pawan Kalyan Shoulder Surgery: ఎన్నో ఏళ్ళ నుండి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ని వెంటాడుతున్న భుజాల నొప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసుకోవడం కోసం , రీసెంట్ గానే ముంబై కి వెళ్లి అంబానీ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, కేవలం మూడున్నర గంటల్లోనే పవన్ కళ్యాణ్ కి సర్జరీ పూర్తి చేశారు వైద్యులు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఆ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ముందుగా రెండు భుజాలకు ఒకేసారి సర్జరీ చేయించుకోవాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేస్తే, నొప్పి భరించలేని స్థాయిలో ఉంటుందని డాక్టర్లు చెప్పడం తో , ముందుగా కుడి భుజానికి సర్జరీ చేశారు. నాలుగు నెలలు పూర్తి అయ్యాక ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయనున్నారు. అయితే ఈ సర్జరీ కి అయ్యే ఖర్చు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను వెచ్చించారు.

సాధారణంగా మంత్రి పదవుల్లో ఉన్నవారికి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు , ప్రభుత్వ నిధులు ఉపయోగించుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో చేయించుకున్నారు. దీంతో ఆయన జనాల డబ్బులకు ఎంత విలువని ఇస్తున్నారో అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సర్జరీ కి ఎంత ఖర్చు అయ్యింది అనే అంశంపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రొటేటర్ కఫ్స్ సర్జరీ చాలా సున్నితమైనది. ఎంతో అనుభవం , నైపుణ్యం ఉన్న డాక్టర్లు మాత్రమే ఈ సర్జరీ చేయగలరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన సర్జరీ చేయించుకున్నారు . సాధారణ హాస్పిటల్స్ కంటే , ఇక్కడ సర్జరీ కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది.

పైగా స్పెషలిస్టులు సర్జరీ చేస్తారు కాబట్టి దాదాపుగా 20 లక్షల వరకు ఖర్చు అయ్యిందని సమాచారం. సాధారణంగా మామూలు రొటేటరీ కఫ్స్ సర్జరీ అయితే 5 నుండి 10 లక్షల రూపాయిల లోపే ఖర్చు అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కేసు చాలా కాంప్లికేటెడ్. పదేళ్ల నుండి ఆ గాయాలు బాగా ముదిరిపోయాయి. అందుకే ఇంత ఖర్చు అయ్యింది. ఎడమ భుజానికి కూడా మరో 20 లక్షల రూపాయిలు ఖర్చు అవుతుందని , ఈ స్థాయి డబ్బులతో సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక ఇంటిని కొనేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper