Toyota Sienna 2026: కారు కొనేటప్పుడు చాలామంది ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొందరు సొంత అవసరాలతో పాటు కార్యాలయ అవసరాలకు చిన్న కారును మాత్రమే కొనుగోలు చేస్తారు. మరికొందరు మాత్రం సౌకర్యవంతంగా ఉండేలా.. ఉమ్మడి ఫ్యామిలీ అంతా కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సెవెన్ సీటర్ కారును ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి వారి కోసం Toyota కంపెనీ గతంలోనే ఇన్నోవా కారును తీసుకువచ్చి ఆకట్టుకుంది. అప్పటినుంచి ఈ కంపెనీ నుంచి ఏ కారు మార్కెట్లోకి వచ్చినా.. దాని గురించి చర్చ సాగుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా Toyota Sienna 2026 ఆవిష్కరణ జరిగింది. ఇది అమెరికాలో ప్రదర్శన అయినప్పటికీ త్వరలోనే భారత్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఫ్యామిలీ అవసరాలతో పాటు మినీ వ్యాన్ లా ఉపయోగించుకునే వారికి Toyota Sienna బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో విశాలమైన క్యాబిన్ తో పాటు సెవెన్ సీటర్, ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉండడంతో చాలామంది దీనిని మీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ముందుగా ఈ కారు బాహ్య డిజైన్ పరిశీలిస్తే దీనిని స్ట్రీమ్ లైన్ బాడీ తో తయారు చేశారు. ఆకట్టుకునే ఎల్ ఈ డి హెడ్లైట్స్, పెద్ద గ్రిల్ ప్రీమియం లుక్ ను అందిస్తాయి. సైడింగ్ డోర్లు, వాలుగా ఉండే రూప్ లైన్స్ అందాన్ని తీసుకువచ్చాయి. ఈ కారు హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో పనిచేయడం వల్ల ఇంధన పనితీరు మెరుగు అని చెప్పవచ్చు. పెట్రోల్ ఇంజన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ను ఇందులో చూడవచ్చు. దీంతో ఒక్కోసారి భారీ సామాగ్రి తో ప్రయాణం చేసిnaa సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. డ్రైవర్లకు అనుగుణంగా ఇంజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్ ఇన్నర్ లో విశాలమైన స్పేస్ ఉండనుంది. ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా లాంగ్ జర్నీ చేసిన ఎలాంటి అలసట ఉండదు. ఎంటర్టైన్మెంట్ ను తలపించే విధంగా క్యాబిన్ అందంగా ఉంటుంది. రెండు వరసల సీట్లు ఉండి మూడో వరుసలో బెడ్ రూమ్ వలె వాడుకోవచ్చు. లగేజ్ తో పాటు ప్రయాణికులు కూడా కూర్చునే విధంగా అనుకూలంగా ఉంటుంది. ఇందులో నేటి తరానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని సెట్ చేశారు. అడాప్ట్ క్రూజ్ కంట్రోల్, లైన్ కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియల్ క్రాస్ ట్రాఫిక్ వంటి లక్షణాలను మనశ్శాంతిని అందిస్తాయి. దీని ఆవిష్కరణ సమయంలో యూఎస్ లో 42000 డాలర్లుగా ధర నిర్ణయించారు.