భారతదేశంలో iPhone లవర్స్ తక్కువే ఉండరు. Apple కంపెనీకి చెందిన ఏ మొబైల్ మార్కెట్ లోకి వచ్చినా వెంటనే దానిని సొంతం చేసుకోవడానికి క్యూలు కడుతూ ఉంటారు. అయితే ఈ కంపెనీకి చెందిన iphone 15 ఇదివరకే మార్కెట్లోకి వచ్చి అలరించింది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఫోన్ పై భారీగా తగ్గింపు ప్రకటించారు. గతంలో ఎక్కువ ధర ఉండటం వల్ల సొంతం చేసుకోలేని వారు.. ఇప్పుడు తగ్గింపు ధరతో దీనిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ తో కూడిన ఈ మొబైల్ ను ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చు అంటే?
ఐఫోన్ 15 ను కొనుగోలు చేయడానికి Jiomart లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 2023 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చింది. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు దీని డిమాండ్ తగ్గకుండా ఉంది. ఎందుకంటే ఇందులో లార్జెస్ట్ స్క్రీన్ తో పాటు ఆకట్టుకునే విధంగా పర్ఫామెన్స్ ఉండడంతో దీని కొనుగోలు ఇప్పటివరకు తగ్గలేదు. అంతేకాకుండా ఇందులో ఆకర్షణీయమైన కెమెరా కూడా ఉండడంతో చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో 6.7 అంగుళాల OLED డిస్ప్లేను అమర్చారు. ఇది ఆపిల్ కంపెనీ లోనే డైనమిక్ డిస్ప్లే గా పేర్కొంటున్నారు. ఈ డిస్ప్లేతో నాణ్యమైన వీడియోలను వీక్షించుకోవచ్చు. అద్భుతమైన సినిమాలను కూడా చూడడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది. ఆకట్టుకునే రంగులు ఇందులో ఉండటంతో ఏ వీడియో అయినా నాణ్యంగా ప్రసారమవుతుంది.
ఐఫోన్ 15 కెమెరా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇందులో డ్యూయల్ కెమెరా కనిపిస్తుంది. ఈ రెండు కలిపి 48 MP మెయిన్ కెమెరా గా పనిచేస్తుంది. అలాగే 12 MP అల్ట్రా వైడ్ కెమెరా గా పని చేస్తుంది. ఈ రెండు కూడా సెన్సార్ కాన్సిస్టెంట్ ఫోటోలను అందిస్తాయి. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేసేవారికి.. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి అద్భుతమైన ఫోటోలను దీని ద్వారా తీసుకోవచ్చు.
ఈ మొబైల్ బ్యాటరీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే రోజంతా వినియోగించినా కూడా డౌన్ టైం తక్కువగా ఉంటుంది. అలాగే వైర్లెస్ చార్జర్ కూడా సపోర్టు ఉండడంతో ఫాస్టెస్ట్ చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫోన్ మూవ్ కావడానికి ఇందులో A 16 మొబైల్ లో ఉండే బయోనిక్ చిప్సెట్ ను అమర్చారు. దీంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుత రోజుల్లో వేగంగా పనిచేయాలని అనుకునే వారికి ఈ ప్రాసెసర్ సపోర్ట్ ఇస్తుంది.
ఇప్పటివరకు మార్కెట్లో దీనిని రూ. 48, 403 నుంచి రూ.89,900 వరకు విక్రయించారు. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా దీనిపై డిస్కౌంట్ ప్రకటించి రూ.41,497 కే అందిస్తున్నారు. బ్యాంకు కార్డుల ద్వారా మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది. కొత్తగా మొబైల్ కొనాలని అనుకునే వారితోపాటు పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు.