Toyota : బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సిద్ధార్థ్ తన భార్య కియారాకు టయోటా కంపెనీకి చెందిన ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. బాలీవుడ్‌లో ఈ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల క్లబ్‌లో ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వారిలో అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
Also Read : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ SUV లు ఇవే..
సిద్ధార్థ్ మల్హోత్రా తన భార్య కియారా అద్వానీకి టయోటా వెల్‌ఫైర్ కారును గిఫ్టుగా ఇచ్చాడు. ఈ కారు ఒక చిన్న వానిటీ రిలాక్స్ వ్యాన్‌లా ఉంటుంది. దీని లగ్జరీ ఫీల్ ఎంతగా ఉంటుందంటే ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీల గ్యారేజీలో తప్పనిసరిగా ఉంటుంది. సిద్ధార్థ్ కియారాకు ఇచ్చిన ఈ ఎంపీవీ అంచనా ధర దాదాపు రూ. 1.22 కోట్లు (ఎక్స్-షోరూమ్). టయోటా వెల్‌ఫైర్ భారతదేశంలో కంపెనీ అత్యంత ఖరీదైన మోడళ్లలో ఒకటి.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం సిద్ధార్థ్, కియారా టయోటా వెల్‌ఫైర్ కారు ప్రీషియస్ మెటల్ రంగులో ఉంది. అయితే ఈ కారు నలుపు, ప్లాటినం వైట్ పెర్ల్ రంగుల్లో కూడా లభిస్తుంది. ఈ కారులో 14 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంది. అలాగే వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం కూడా 14 ఇంచుల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. ఈ కారులో జేబీఎల్ 15 స్పీకర్లు, సౌండ్ సిస్టమ్ ఉంటుంది.
టయోటా వెల్‌ఫైర్‌ను ప్రత్యేకంగా నిలిపేది దాని 8 విధాలుగా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రెండవ వరుసలోని లగ్జరీ మసాజింగ్ ఫెసిలిటీ కలిగిన సీటు. అంతేకాకుండా ఈ కారులో స్లైడింగ్ డోర్‌లు ఉన్నాయి.. అవి కేవలం ఒక టచ్‌తో పనిచేస్తాయి. దీనివల్ల ఈ కారులోకి ఎక్కడం, దిగడం, ముఖ్యంగా సెలబ్రిటీల ఫ్యాషనబుల్ డ్రెస్సులతో చాలా సులభంగా ఉంటుంది. ఈ కారులో ADAS సేఫ్టీ, డ్యూయల్ సన్‌రూఫ్, 14 కలర్ లైటింగ్‌తో కూడిన యాంబియన్స్ కూడా లభిస్తుంది.
సెలబ్రిటీలకు టయోటా వెల్‌ఫైర్ అంటే చాలా ఇష్టం. దీనికి కారణం ఇందులో వానిటీ వ్యాన్‌లో ఉండే అనేక ఫీచర్లు ఉండటమే. సిద్ధార్థ్, కియారా మాత్రమే కాదు, అమీర్ ఖాన్ లేదా ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి వారితో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్ వంటి సెలబ్రిటీల వద్ద కూడా ఈ కారు ఉంది.
టయోటా వెల్‌ఫైర్ 2.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 190.42 బిహెచ్‌పి గరిష్ట పవర్ , 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో e-CVT ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. దీని మైలేజ్ లీటరుకు దాదాపు 19.28 కిమీగా ఉంటుంది.
Also Read : ఫైవ్ స్టార్ సేఫ్టీ.. తక్కువ ధర.. అమ్మకాల్లో ఇది రికార్డ్