https://oktelugu.com/

Toyota Rumion : టయోటా ఇన్నోవా తరువాత ఈ కారు మరో సంచలనం కానుందా? సేల్స్ ఎందుకు పెరుగుతున్నాయ్?

ఒకప్పుడు 7 సీటర్ కారుల టయోగా ఇన్నోవా ప్రత్యేకంగా నిలిచింది. దశాబ్దం పాటు ఈ కారు అందరికీ అనుగుణంగా ఉండేది. ఆ తరువాత మారుతి ఎర్టీగాను ఎక్కువగా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వీటికి పోటీ ఇచ్చేందుకు టయోటా కంపెనీ నుంచి 7 సీటర్ కారు అందుబాటులోకి రాబోతుంది. ఇంతకీ ఈ కారు ఏదీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.

Written By:
  • Mahi
  • , Updated On : October 21, 2024 / 05:16 PM IST

    Toyota Rumion

    Follow us on

    Toyota Rumion : కార్ల మార్కెట్లోకొన్నింటికి ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. వీటిలో 7 సీటర్ కార్లను ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపుతారు. కార్యాలయ అసరాలతో పాటు హుందాగా సొంత వెహికల్ ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబ ఉన్న వారు ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించడానికి 7 సీటర్ కారు అనుగుణంగా ఉంటుంది. ఒకప్పుడు 7 సీటర్ కారుల టయోగా ఇన్నోవా ప్రత్యేకంగా నిలిచింది. దశాబ్దం పాటు ఈ కారు అందరికీ అనుగుణంగా ఉండేది. ఆ తరువాత మారుతి ఎర్టీగాను ఎక్కువగా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వీటికి పోటీ ఇచ్చేందుకు టయోటా కంపెనీ నుంచి 7 సీటర్ కారు అందుబాటులోకి రాబోతుంది. ఇంతకీ ఈ కారు ఏదీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.

    టయోటా అనగానే ఇన్నోవా గుర్తుకు వస్తుంది. ఒకప్పుడ ఇన్నోవా సంచలనం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మరో సంచలన సృష్టించడానికి టయోటా కంపెనీ రెడీ అవుతోంది. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన 7 సీటర్ కారును కొనేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. టయోటా నుంచి గత ఏడాది ఆగస్టులో మార్కెట్లోకి వచ్చింది రూమియాన్. ఇందులో పెట్రోల్, డీజిల్ వెర్షన్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇది మంచి మైలేజ్ కూడా ఇవ్వడంతో దీనిని కొనేందుకు ఇష్టపడుతున్నారు.