Toyota Land Cruiser: భారత ఆటోమోబైల్ మార్కెట్లో Toyota కంపెనీ వివిధ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజైన ఇన్నోవా కారు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సరికొత్త ఆఫ్ రోడ్ వెహికిల్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఈ వెహికిల్ ను హైబ్రిడ్ గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఎలక్ట్రిక్ పవర్ తో పాటు పెట్రోల్, సీఎన్ జీ వెరియంట్ ను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ అక్టోబర్ లో జరగనున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో దీనిని ప్రదర్శించనున్నారు. ఇది మహీంద్రా థార్, మారుతి జమ్నికి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ మోడల్ గురించి తెలుసుకుందామా..
Toyota నుంచి రిలీజ్ అయిన ల్యాండ్ క్రూయిజర్ గురించి కార్ల వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే దీనిని ఎస్ యూవీ లెవల్లో తీర్చి దిద్దుతున్నారు. దీనిని లైట్ క్రూయిజర్ లేదా యూరిస్ క్రూయిజర్ అని పిలుస్తున్నారు. ఇది బేసిగ్గా ఎలక్రటిక్ వాహనం (ఈవీ) అయినప్పటికీ ఇందులో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ను కూడా అమర్చారు. దీంతో పాటు టెలియ్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, ఎల్ ఈ డీ హెడ్ ల్యాంప్ లు కలిగి ఉంటాయి.
ఆన్ లైన్లో దొరికిని సమాచారం మేరకు యూరిస్ క్రూయిజర్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. హైబ్రిడ్ ఇంిజన్ 2.8 లీటర్ టర్బోచార్జ్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ను ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న ల్యాండ్ క్రూయిజర్ కు మినీ కాన్సెప్ట్ మోడల్ అన్నట్లుగా దీని ముందు భాగంలో రెట్రో డిజైన్ చేసి ఉంది. మధ్యలో టయోడా బ్రాండ్ తో కూడిన గ్రిల్ ఉంటుంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్ సహా ఆఫ్ వీల్ అర్చిలతో కూడిన బంపర్ కూడా ఉంది.
ఇప్పటి వరకు ఇదే మోడల్ లో మహీంద్రా నుంచి థార్, మారుతి సుజుకీ నుంచి జమ్ని ఆకర్షిస్తున్నారు. వీటికి పోటీగా టయోటా యూరిస్ క్రూయిజర్ ఆకట్టుకుంటుందని ఆటోమోబైల్ రంగంలో చర్చ సాగుతోంది. అయితే ఇది భారత్ లో అందుబాటులో ఉంటుందా? లేదా? అనే కంపెనీ అధికారికంగా ప్రకటించాలి. గత సంవత్సరమే ఈ కారు కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చినా ప్రొడక్షన్ కొనసాగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో మాత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.