Toyota : టయోటా కంపెనీ ఇండియన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం లేదు. కానీ దాని ఫోకస్ ఎప్పుడూ హైబ్రిడ్ కార్లపైనే ఉంటుంది. ఏప్రిల్ 2025లో దేశంలో మొత్తం 8,754 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు అమ్ముడయ్యాయి. అందులో టయోటా ఒక్కటే 7,007 యూనిట్లను అమ్మడం విశేషం. అంటే ప్రతి 10 హైబ్రిడ్ కార్లలో 8 టయోటా అమ్మినవే. టయోటా దేశంలో ఇన్నోవా హైక్రాస్, హైరైడర్, వెల్‌ఫైర్, కామ్‌రీ కార్లను అమ్ముతోంది. వీటిలో హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది.
Also Read : టయోటా సంచలనం.. డీజిల్ లేకుండానే దూసుకుపోతుంది
ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఇండియా, హోండా కార్స్ కూడా ఉన్నాయి. మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ 2025లో 1,657 హైబ్రిడ్ కార్లను అమ్మగా, అందులో గ్రాండ్ విటారా, ఇన్విక్టో మోడళ్లు ఉన్నాయి. ఇక హోండా కార్స్ ఇండియా కేవలం 90 హోండా సిటీ హైబ్రిడ్ కార్లను మాత్రమే అమ్మగలిగింది.
పెరుగుతున్న హైబ్రిడ్ కార్ల డిమాండ్
ఇటీవల చాలా రాష్ట్రాలు హైబ్రిడ్ కార్లపై భారీ సబ్సిడీలను ఇవ్వడం మొదలుపెట్టాయి. ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో ముందుంది. దీనివల్ల దేశంలో హైబ్రిడ్ కార్ల డిమాండ్, అమ్మకాలు పెరుగుతున్నాయి. టయోటా, మారుతి, హోండా కలిపి దేశంలో దాదాపు 7 కార్లు హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్నాయి.
హైబ్రిడ్ కార్ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, పెట్రోల్-డీజిల్ కార్లతో పోలిస్తే ఇవి చాలా మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీని ఇస్తాయి. అంతేకాదు వీటి కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ హైబ్రిడ్ మోడల్‌ను చూస్తే, ఇది లీటర్‌కు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సాధారణంగా ఇంత మైలేజీ చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో వస్తుంది. కాబట్టి ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీకి ఇది చాలా మంచి మైలేజీ అని చెప్పొచ్చు.
Also Read : Toyota నుంచి ప్రత్యేక ఎడిషన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..