https://oktelugu.com/

ఉద్యోగులకు శుభవార్త.. కరోనా వస్తే 21 రోజులు సెలవులు..?

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏప్రిల్ నెల తొలివారం నుంచి పల్లెలు, పట్టణాలు అనే తేడాల్లేకుండా అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ కరోనా నిర్ధారణ అయిన ఉద్యోగులకు 21 రోజుల వేతనంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 27, 2021 / 02:56 PM IST
    Follow us on

    దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏప్రిల్ నెల తొలివారం నుంచి పల్లెలు, పట్టణాలు అనే తేడాల్లేకుండా అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తున్నాయి.

    ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ కరోనా నిర్ధారణ అయిన ఉద్యోగులకు 21 రోజుల వేతనంతో కూడిన సెలవులను ఇస్తోంది. ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. విప్రో మరికొన్ని ఐటీ కంపెనీలు కరోనా వైరస్ పడిన ఉద్యోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ కోవిడ్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

    మరికొన్ని ఐటీ కంపెనీలు ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందించడంతో పాటు ఇతర మెడికల్ ఫెసిలిటీలను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులను అందిస్తూ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్లతో జతకడుతూ టెస్టింగ్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటూ కంపెనీలు ఉద్యోగులకు మేలు చేస్తున్నాయి.

    ఇన్ఫోసిస్ కంపెనీ 242 పట్టణాల్లో 1490 హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని కరోనా బారిన పడిన ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు మేలు చేస్తోంది. కొన్ని కంపెనీలు వ్యాక్సినేషన్ క్యాంపులు, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి సేవలు అందిస్తూ ఉద్యోగులు కరోనా బారిన పడినా చికిత్స అందేలా కృషిచేస్తున్నాయి.