Homeబిజినెస్Top 5 SUVs India 2026: బెస్ట్ రోడ్ క్లియరెన్స్ కలిగిన టాప్ 5 పాపులర్...

Top 5 SUVs India 2026: బెస్ట్ రోడ్ క్లియరెన్స్ కలిగిన టాప్ 5 పాపులర్ SUVలు ఇవే..

Top 5 SUVs India 2026: భారతీయ రహదారుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరాల్లోని భారీ స్పీడ్ బ్రేకర్లు, వర్షాకాలం వస్తే రోడ్లపై నిలిచే నీరు నిలవడం వంటి సమస్యలు ఉంటాయి. పల్లెటూళ్లోకి వెళ్తే గుంతల రోడ్లు తట్టుకుని ముందుకు వెళ్లాలి. ఈ పరిస్థితులకు అనుగుణంగా భారత్‌లో ఎక్కువ మంది కార్ల కొనుగోలుదారులు ఎత్తైన బాడీ, అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్ ఉన్న SUVల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే 2026 నాటికి భారతీయ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ రోడ్ క్లియరెన్స్ కలిగిన టాప్ 5 పాపులర్ ఎస్‌యూవీలు ఏవో చూద్దాం..

ఫోర్స్ గూర్ఖా (Force Gurkha):
ఆఫ్‌రోడ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన వాహనాల్లో ఫోర్స్ గూర్ఖా ముందు వరుసలో ఉంటుంది. భారతదేశపు మెయిన్‌స్ట్రీమ్ SUVలలో అత్యధికంగా 233 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. దీని భారీ టైర్లు, దృఢమైన బాడీ ఎలాంటి కొండరాళ్లనైనా, లోతైన బురద రోడ్లనైనా సులువుగా దాటగలవు. గంభీరమైన లుక్, అద్భుతమైన 4×4 సదుపాయంతో ఇది కఠినమైన దారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. దీని ధర రూ. 16.31 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

మహీంద్రా థార్ & థార్ రాక్స్ (Mahindra Thar & Thar Roxx):
భారత్‌లో అత్యంత క్రేజ్ ఉన్న లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ మహీంద్రా థార్. 3 డోర్ తో పాటు కొత్తగా వచ్చిన 5 డోర్ థార్ రెండు మోడళ్లు కూడా 226 మి.మీ. అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తాయి. పర్వత ప్రాంతాలు, ఇసుక తిన్నెలు లేదా భారీ గుంతలు ఉన్న రోడ్లపై ఈ కారు అస్సలు కింద తగలకుండా దూసుకుపోతుంది. ఆఫ్‌రోడింగ్‌తో పాటు సిటీ రోడ్లపై కూడా ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ. 10.32 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner):
దశాబ్దాలుగా ఇండియన్ ప్రీమియం SUV సెగ్మెంట్‌ను ఏలుతోంది టొయోటా ఫార్చ్యూనర్. ఈ ఫుల్ సైజ్ SUV 225 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. దీని భారీ చక్రాలు, పవర్‌ఫుల్ ఇంజన్ దీనికి ఎంతటి క్లిష్టమైన రహదారినైనా సునాయాసంగా అధిగమించే శక్తిన ఇస్తాయి. హైవేలపై ప్రయాణించినా, అడవుల్లో ఆఫ్‌రోడింగ్ చేసినా దీని రైడ్ కంఫర్ట్ మరియు విశ్వసనీయత అద్భుతంగా ఉంటాయి.దీని ధర రూ. 34.76 నుంచి రూ. 50.46 లక్షల వరకు ఉంది.

హోండా ఎలివేట్ (Honda Elevate) :
మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో ఒక సాధారణ ఫ్యామిలీ SUVగా ఉంటూనే, అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉన్న ఘనత హోండా ఎలివేట్ సొంతం. ఈ కారు ఏకంగా 220 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రత్యర్థుల కంటే ఇది ఎత్తుగా ఉండి, నగరాల్లోని ఎత్తైన స్పీడ్ బ్రేకర్లను మరియు గుంతలను డ్రైవర్లు ఎలాంటి టెన్షన్ లేకుండా దాటడానికి సహాయపడుతుంది. దీనిని రూ.11.60 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేస్తున్నారు.

జీప్ మెరిడియన్ (Jeep Meridian):
ప్రీమియం 7-సీటర్ విభాగంలో గట్టి పోటీనిస్తున్న జీప్ మెరిడియన్ 214 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. విలాసవంతమైన ఇంటీరియర్స్, అత్యాధునిక ఫీచర్లతో పాటు ఇండియన్ కండిషన్స్‌కు తగ్గట్టుగా దీని సస్పెన్షన్, ఎత్తును డిజైన్ చేశారు. లాంగ్ ట్రిప్స్ వేసే కుటుంబాలకు భద్రతతో పాటు సాఫీనైన ప్రయాణాన్ని ఈ కారు అందిస్తుంది. ఈ కారును రూ. 38.17 లక్షల నుంచి కొనుగోలు చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular