AI smartphones Under 30000: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ మంది ‘కృత్రిమ మేధస్సు’ (AI) ఫీచర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టుగానే ప్రముఖ మొబైల్ కంపెనీలు సైతం వినూత్న AI ఫీచర్లతో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే, ఫీచర్లతో పాటు బడ్జెట్ కూడా చాలా ముఖ్యమని భావించేవారే ఎక్కువ. అలాంటి వారి కోసం రూ. 30,000 లోపు బడ్జెట్‌లో లభించే టాప్-5 AI స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం..
1. మోటోరోలా ఎడ్జ్ 70 (Motorola Edge 70):
మోటోరోలా కంపెనీ నుంచి వచ్చిన ‘ఎడ్జ్ 70’ స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో పాటు అద్భుతమైన స్మార్ట్ AI ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోటోగ్రఫీని మరింత మెరుగుపరచడానికి, రోజువారీ ఉత్పాదకతను పెంచడానికి ఇందులో ప్రత్యేక AI టూల్స్ సహాయపడతాయి. 68W ఫాస్ట్ చార్జింగ్, 12GB ర్యామ్ కలిగిన ఈ ప్రీమియం మోడల్ రూ. 30,000 లోపు ధరలో అందుబాటులో ఉంటూ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
2. శామ్‌సంగ్ గెలాక్సీ M47 (Samsung Galaxy M47):
రూ. 24,999 ప్రారంభ ధరతో లభించే శామ్‌సంగ్ గెలాక్సీ M47 స్మార్ట్‌ఫోన్ ఈ బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇందులో శామ్‌సంగ్ గెలాక్సీకి చెందిన అధునాతన AI ఫీచర్లతో పాటు వన్ యూఐ సపోర్ట్ ఉంది. 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో భారీ 6000mAh బ్యాటరీని అందించారు. దీనికి తోడు కంపెనీ ఏకంగా 6 సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్ అందిస్తామని హామీ ఇవ్వడం విశేషం.
3. రియల్‌మి P4 పవర్ (Realme P4 Power):
భారీ బ్యాటరీ, అద్భుతమైన ఏఐ పవర్‌ను కోరుకునే వారి కోసం రియల్‌మి P4 పవర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 27,999 గా ఉంది. ఇందులో గూగుల్ జెమిని లైవ్ వంటి అధునాతన ఏఐ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. అలాగే ఇందులోని ‘హైపర్ విజన్ ప్లస్ AI చిప్’ గేమ్స్ ఆడేటప్పుడు డిస్‌ప్లే రిజల్యూషన్ , ఫ్రేమ్ రేట్స్‌ను చాలా స్మూత్‌గా బూస్ట్ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఏకంగా 10,001 mAh బ్యాటరీని అందించారు.
4. వన్‌ప్లస్ N6 (OnePlus N6):
వన్‌ప్లస్ అభిమానుల కోసం రూ. 22,999 బడ్జెట్‌లోనే ‘వన్‌ప్లస్ N6’ లభిస్తోంది. ఆక్సిజన్ ఓఎస్ 16 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌లో ఫోటోలను ఎడిట్ చేయడానికి, క్లారిటీ పెంచడానికి వీలుగా మంచి AI కెమెరా ఫీచర్లను జోడించారు. 6.8 అంగుళాల భారీ స్క్రీన్, డైమెన్సిటీ 6360 ప్రాసెసర్‌తో పాటు 8000mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీని ఇందులో అందించారు. బడ్జెట్ ధరలో వన్‌ప్లస్ బ్రాండ్ వాల్యూతో పాటు పవర్‌ఫుల్ ఏఐ కెమెరా అనుభూతిని ఇది ఇస్తుంది.
5. వివో T5x (Vivo T5x):
వివో నుంచి వస్తున్న ‘T5x 5G’ స్మార్ట్‌ఫోన్ (6GB ర్యామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్ రూ. 24,999 ధరలో లభిస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు AI కెమెరా మోడ్స్ ఉన్నాయి. చీకటిలో సైతం స్పష్టమైన ఫోటోలు తీయడానికి ఇందులోని ఏఐ ఫీచర్లు తోడ్పడతాయి. 7200mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్ మరియు IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ ఈ బడ్జెట్‌లో చాలా పవర్‌ఫుల్‌గా నిలుస్తుంది.
