Times Best Company List : ప్రపంచంలో వివిధ రంగాల్లో టైమ్స్ మ్యాగజైన్ ఏటా ర్యాంకులు విడుదల చేస్తుంది. ఈ ర్యాంకులు అంతర్జాతీయంగా కంపెనీల ఇమేజ్‌ను పెంచుతాయి. ఫలితంగా కంపెనీకి వచ్చే ప్రాజెక్టులు పెరుగుతాయి. వ్యాపార పురోభివృద్ధికి ర్యాంకులు దోహదపడతాయి. తాజాగా టైమ్స్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి సబంధించినన బెస్ట్ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 1000 కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి 22 కంపెనీలకు స్థానం దక్కింది. విదేశీ కంపెనీల జాబితాలో భారత్ మొదటిస్థానంలో ఉండడం గమనార్హం. విదేశీ కంపెనీల జాబితాలో అదానీ, అంబానీ ఇండస్ట్రీస్‌కు స్థానం దక్కలేదు. ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తొలిస్థానంలో నిలిచింది.
హెచ్‌సీఎల్‌కు 112వ ర్యాంకు..
టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన బెస్ట్ కంపెనీల జాబితాలో 1000 కంపెనీలు ఉన్నాయి. ఇందులో మన దేశానికి చెందిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 112వ స్థానంలో ఉంది. భారత తరఫున మొదటి స్థానంలో ఉంది. తర్వాత 119 స్థానంలో ఇన్‌ఫోసిస్, 134వ స్థానంలో విప్రో, 187వ స్థానంలో మహీంద్రా గ్రూపు నిలిచాయి. బ్యాంకుల విభాగంలో 504వ ర్యాంకుతో యాక్సిస్ బ్యాంకు బెస్ట్ కంపెనీల జాబితాలో ముందు వరుసలో ఉంది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 518వ ర్యాంకు వచ్చింది. తర్వాత ఐసీఐసీఐ 525వ ర్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు 551 ర్యాంకు దక్కించుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 646వ ర్యాంకు, అదానీ గ్రూప్ 736వ ర్యాంకు సాధించాయి.
ఈ అంశాల ఆధారంగా..
టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ర్యాంకులు, ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, మానవత్వం ఆధారంగా కేటాయించింది. 50 దేశాల్లో మొద్తం 1,70,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించింది. ఆయా కంపెనీలు 2021 నుంచి 2023 వరకు సాధించిన వృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకుంది. 2023 నాటికి కంపెనీలు 100 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఆదాయం కలిగిన వాటిని జాబితాలో చేర్చింది.
టైమ్స్ బెస్ట్ 22 కంపెనీలు ఇవే..
హెచ్‌సీఎల్(112), ఇన్‌ఫోసిస్(119, విప్రో(134), మహీంద్రా గ్రూప్(187), యాక్సిస్ బ్యాంకు(504), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(518), ఐసీఐసీఐ బ్యాంకు(525) ఎల్‌అండ్‌టీ(549), కోటక్ మహీంద్ర బ్యాంకు(551), ఐటీసీ(586), హీరో మోటోకార్ప్(597), రిలయన్స్ ఇండస్ట్రీస్(646), మదర్స్‌న్ గ్రూపు(697), అదానీ గ్రూప్(736), ఎన్టీపీసీ లిమిటెడ్(752), యెస్ బ్యాంకు(783), బ్యాంక్ ఆఫ్ బరోడా గ్రప్(850), గోద్రెజ్(921), బజాజ్ గ్రూపు(952), సిప్లా(957), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(987), ఎంఆర్‌ఎఫ్(993).