https://oktelugu.com/

Bollywood Star Govinda : స్టార్ హీరోని రోజూ చూడాలని పని మనిషిగా ఇంట్లోకి వెళ్లిన మంత్రి కూతురు, అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

అభిమానం ఒక్కోసారి వెర్రితలలు వేస్తుంది. ఫ్యాన్స్ పేరిట చేసే పనులు విస్తు గొలుపుతాయి. ఇండియాలో హీరోలను అభిమానించినంతగా మరొక దేశంలో అభిమానించరేమో. కాగా ఓ అమ్మాయి తన అభిమాన హీరోని రోజూ చూడాలనే కోరికతో పనిమనిషిగా చేరిందట. ఈ ఆసక్తికర పరిణామం ఓ స్టార్ హీరో ఇంట్లో చోటు చేసుకుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 14, 2024 / 04:22 PM IST

    Bollywood Star Govinda

    Follow us on

    Bollywood Star Govinda :  హీరోలను దేవుళ్ళలా పూజిస్తారు ఇండియన్స్. వారి కోసం ఎంతకైనా తెగిస్తారు. తమ హీరో పుట్టినరోజు వస్తుందంటే నెల రోజుల ముందే హంగామా మొదలెడతారు. బర్త్ డే నాడు బ్యానర్స్ కడతారు. కేక్స్ కట్ చేస్తారు. రక్తదానం, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక కొత్త మూవీ విడుదల అంటే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అర్థరాత్రి నుండే థియేటర్స్ అలంకరించి, బ్యానర్స్ కడతారు.

    దప్పులతో థియేటర్స్ ఎదుట మోత మోగిస్తున్న. అభిమానుల చర్యలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వీటన్నింటికీ మించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ హీరో అభిమాని ఆయనను రోజూ చూడాలనే కోరికతో ఏకంగా ఇంట్లో పనిమనిషి అవతారం ఎత్తింది. సదరు హీరో ఎవరో కాదు గోవిందా. బాలీవుడ్ టాప్ స్టార్స్ లో గోవింద ఒకరు. 90లలో ఆయన స్టార్డం పీక్స్ లో ఉంది. కామెడీ హీరోగా ప్రసిద్ధిగాంచాడు. అలాగే మంచి డాన్సర్ కూడాను.

    గోవిందాకు నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఫాలోయింగ్ ఉండేది. కాగా ఓ యువతి గోవింద డై హార్డ్ ఫ్యాన్ అట. ఆయన్ని కలవాలని కలలు కనేదట. ఆయన్ని రోజూ చూడాలంటే ఇంట్లో పని మనిషిగా చేరడమే సరైన మార్గం అనుకుందట. ఆలోచన వచ్చిందే తడవుగా… గోవిందా ఇంటి ముందు పడిగాపులు కాసిందట. ఒకరోజు ఎందుకు ఇక్కడే ఉంటున్నావని అడగ్గా… నాకు ఎవరూ లేరు. పని కావాలి అని అడిగిందట.

    దాంతో పని మనిషిగా పెట్టుకున్నారట. గోవిందా షూటింగ్స్ నుండి ఇంటికి వచ్చే వరకు నిద్రపోకుండా వేచి చూసేదట. కానీ ఆమెకు పనులు చేయటం వచ్చేది కాదట. కనీసం పాత్రలు తోమటం, ఇల్లు శుభ్రం చేయడం కూడా తెలియదట. చూస్తేనేమో పెద్దింటి అమ్మాయిలా ఉంది. పని మనిషిని అంటుంది, కానీ పనులు రావడం లేదని, గోవిందా భార్యకు అనుమానం కలిగిందట. ఇదే విషయాన్ని గోవిందా తల్లితో చెప్పిందట.

    గట్టిగా ఆ యువతిని నిలదీయడంతో కన్నీళ్లు పెట్టుకుందట. తన వివరాలు చెప్పి, గోవిందా కోసమే పని మనిషిగా చేరానని చెప్పిందట. కట్ చేస్తే ఆ అమ్మాయి ఓ మంత్రి కూతురట. వాళ్లకు సమాచారం ఇవ్వడంతో నాలుగు ఖరీదైన కార్లలో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుపోయారట. దాదాపు 20 రోజులు ఆ యువతి గోవిందా ఇంట్లో ఉందట. ఈ విషయాన్ని గోవిందా భార్య ఓ సందర్భంలో వెల్లడించారు.