Business Ideas: వేసవిలో ఈ చిన్న బిజినెస్ ద్వారా రూ.50 వేల నుంచి లక్ష రూపాయల లాభం పొందుతారు..

వ్యాపారాలు చేసేవారికి కాస్త చొరవ ఉండాలి. బిడియం, భయం ఉన్నవాళ్లు బిజినెస్ లో రాణించలేదు. అయితే కొన్ని వ్యాపారాలను చూస్తే చిన్నవే అనిపిస్తాయి.

Written By: Chai Muchhata, Updated On : May 19, 2023 4:42 pm

Business Ideas

Follow us on

Business Ideas: నేటి యువత లక్షలు, కోట్ల జీతం ఇచ్చే సంస్థలను వదిలి సొంతంగా వ్యాపారం పెట్టాలని చూస్తున్నారు. విదేశాలకు వెళ్లిన వారు సైతం సొంత దేశానికి వచ్చి ఓన్ బిజినెస్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొన్నాళ్ల పాటు నష్టాలు వచ్చినా ఆ తరువాత లాభాల పంట పండుతోంది. అయితే చాలా మంది మిడిల్ క్లాన్ యూత్ బిజినెస్ చేయాలన్న తపన ఉన్నా.. వారిదగ్గర సరైన ఇన్వెస్ట్ మెంట్ లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. కానీ వారికి అవగాహన లేకపోవడంతో కాలాన్ని వృథా చేస్తున్నారు. సీజన్ బిజినెస్ లో భాగంగా వేసవిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే రూ.50 వేల వరకు సంపాదించొచ్చు.

వ్యాపారాలు చేసేవారికి కాస్త చొరవ ఉండాలి. బిడియం, భయం ఉన్నవాళ్లు బిజినెస్ లో రాణించలేదు. అయితే కొన్ని వ్యాపారాలను చూస్తే చిన్నవే అనిపిస్తాయి. కానీ అవి లాభాల పంట పండిస్తాయి. వీటిలో ప్రముఖమైనది వేసవిలో చల్లటి పానీయాలు విక్రయించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎండలు మండిన సమయంలో బయటకు వెళ్లిన చాలా మంది ఏదో ఒక చల్లటి పానీయాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతారు. వీరికోసం రుచికరమైన ద్రవాన్ని వారికి అందించడం ద్వారా సొమ్ము చేసుకోవచ్చు.

అలాంటి పానీయాల్లో లస్సీ ఒకటి. లస్సీ గురించి చాలా మందికి తెలియదు. కొందరు దీనిని ఎక్కువగా ఇష్టపడరు కూడా. కానీ రుచికరంగా చేస్తే మాత్రం అదిరిపోద్ది. లస్సీ వ్యాపారం చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు. అయితే కేవలం లస్సీ కోసం ప్రత్యేకంగా వ్యాపారాన్నా ప్రారంభించడం కరెక్ట్ కాదు. ఉదాహరణకు టీ స్టాల్ ఏర్పాటు చేసిన వారు వాటితో పాటు వేసవిలో పలు కూల్ డ్రింక్స్ తో పాటు లస్సీని కూడా విక్రయించడం ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

పెరుగులో కొంచెం చక్కెర, ఉప్పు వేయడం వల్ల లస్సీ తయారవుతుంది. కానీ ఇది మాములుగా వేయడం వల్ల తాగలేం. అందువల్ల లస్సీని తయారు చేసేందుకు ప్రత్యేకంగా మిషన్ ఉంటుంది. ఇందులో కావాల్సిన ఐటమ్స్ వేయడం వల్ల లస్సీ రుచికరంగా తయారవుతుంది. ఈ మిషన్ రూ.25 నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. ఇక లస్సీ గ్లాస్ ప్రస్తుతానికి రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు. మీరు రుచికరంగా లస్సీని తయారు చేస్తేవారు రోజుకు ఒక్కసారైనా తాగేందుకు ఇష్టపడుతారు. ఇలా రోజుకు 20 నుంచి 30 గ్లాసుల వరకు వేసవి కాలంలో విక్రయిస్తే రూ.50 నుంచి లక్ష వరకు లాభం పొందే అవకాశం ఉంది.