జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. కొత్త రకం మోసం..?

జియో రాకతో దేశీయ టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో జియో కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే జియో కస్టమర్లను టార్గెట్ చేసి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను దొంగలించడానికి సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. డైలీ డౌన్ లోడ్ లిమిట్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలని కోరుతూ కొందరు జియో కస్టమర్లకు గత కొన్ని రోజుల నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. […]

Written By: Kusuma Aggunna, Updated On : December 15, 2020 10:35 am
Follow us on


జియో రాకతో దేశీయ టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో జియో కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే జియో కస్టమర్లను టార్గెట్ చేసి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను దొంగలించడానికి సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. డైలీ డౌన్ లోడ్ లిమిట్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలని కోరుతూ కొందరు జియో కస్టమర్లకు గత కొన్ని రోజుల నుంచి మెసేజ్ లు వస్తున్నాయి.

Also Read: సముద్రం ఒడ్డుకు కొట్టుకొస్తున్న బంగారం.. ఎక్కడో తెలుసా..?

సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఈ తరహా మెసేజ్ లు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ డైలీ లిమిట్ ను 1 జీబీ నుంచి 10జీబీకి పెంచుతామని అయితే అన్ని వివరాలు ఇస్తే మాత్రమే డైలీ లిమిట్ పెరుగుతుందని ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. అందులో వివరాలను పొందుపరిచిన తరువాత ఆ మెసేజ్ ను మరో పదిమందికి పంపితే డేటా అప్ గ్రేడ్ అవుతుందని ఉంటుంది. అయితే ఎంతమందికి వాట్సాప్ లో మెసేజ్ పంపినా డేటా మాత్రం అప్ గ్రేడ్ కాదు.

Also Read: కార్లు కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్.. రూ.మూడు లక్షల డిస్కౌంట్..?

వ్యక్తిగత వివరాలు సైబర్ మోసగాళ్లకు ఇవ్వడం వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల జియో కస్టమర్లు ఇలాంటి ఫేక్ లింక్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కంపెనీ ఏవైనా ఆఫర్లు ఉంటే అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. జియో కంపెనీ సైతం http://upgrade-jio4g.ml/ యూఆర్‌ఎల్ కు తమకు సంబంధం లేదని ప్రకటన చేసింది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

జియోకు ఆ సంస్థ అనుబంధ సంస్థ కాదని ఆ వెబ్ సైట్ నుంచి వచ్చే నకిలీ ఆఫర్లను నమ్మవద్దని జియో కీలక ప్రకటన చేసింది. అందువల్ల జియో కస్టమర్లు ఫేక్ ఆఫర్ల పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ లను నమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.