కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలోని ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన పెరిగింది. చాలామంది ప్రజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మారికి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు.
Also Read: చక్కెరను ఎక్కువగా వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధి వచ్చే ఛాన్స్..?
అయితే మనకు తెలియకుండా మనం చేసే కొన్ని తప్పులే చాలా సందర్భాల్లో ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తాయి. పురుషుల్లో చాలామందికి మద్యం అలవాటు ఉంటుంది. మద్యం అలవాటు ఉన్నవాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు కాలేయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మద్యం ఎక్కువగా సేవించే వాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: అసిడిటీ సమస్యకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
చక్కెర కూడా ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తుందని.. అందువల్ల చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే మంచిదని తెలుపుతున్నారు. వంటల్లో ఎన్ని వేసినా ఉప్పు వేయకపోతే వంటలకు రుచి రాదు. అయితే ఎక్కువ మొత్తంలో ఉప్పు తింటే మాత్రం ఇబ్బందులు తప్పవు. శరీరంలో ఉప్పు ఎక్కువైతే శరీరం బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కోల్పోతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కాఫీ, టీలను ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న విషయాలకు ఒత్తిడికి గురైనా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని.. ఒత్తిడికి గురి కావడం వల్ల జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.