https://oktelugu.com/

Car Sales: సేల్స్ లో సత్తా చాటిన కార్లు.. ఏంటో తెలుసా?

ప్రతి సంవత్సరం తరహాలోనే ఈ ఏడాది కూడా కార్ల విక్రయాలు జోరుగా కొనసాగాయి. ప్రధానంగా పండుగ సీజన్లలో వీటి అమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 11, 2023 / 06:12 PM IST

    Car Sales

    Follow us on

    Car Sales: మారుతున్న కాలానితో పాటు టెక్నాలజీ కూడా రోజురోజుకు ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. అందుకు తగినట్లుగానే పరికరాలు, వస్తువులతో పాటు వెహికల్స్ కూడా రూపాంతరం చెందుతున్నాయి.. ఈ క్రమంలోనే కార్ల వినియోగం సైతం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో రోజుకో ఫీచర్ ను యాడ్ చేస్తూ కార్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.

    ప్రతి సంవత్సరం తరహాలోనే ఈ ఏడాది కూడా కార్ల విక్రయాలు జోరుగా కొనసాగాయి. ప్రధానంగా పండుగ సీజన్లలో వీటి అమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ లో కార్ల సేల్స్ ఎక్కువగా సాగాయని తెలుస్తోంది. అందుకు సంబంధించి సేల్స్ లో సత్తా చాటిన కార్ల కంపెనీ జాబితా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఈ జాబితాలో ఎప్పటి తరహాలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొదటి స్థానంలో నిలిచింది. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో మారుతీ సుజుకి కార్లను అందిస్తుంది. అందుకే ఈ సంస్థకు చెందిన కార్లకు విపరీతమైన ఆదరణ ఉంటుందన్న అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే 1,34,158 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 1.3 శాతం వృద్ధిని సాధించగా వీటిలో గ్రాండ్ విటారా, బ్రెజ్జా, ఎర్టిగా, స్విప్ట్, వ్యాగన్ ఆర్ కార్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు.

    రెండో స్థానంలో హ్యుందాయ్ మోటార్స్ నిలిచింది. ఈ నవంబర్ లో సుమారు 49,451 కార్లను విక్రయించింది ఈ సంస్థ. గత సంవత్సరంతో పోలిస్తే 3 శాతం వృద్ధిని సాధించిన హ్యుందాయ్ మోటార్స్ క్రెటా, ఎక్స్ టర్, వెన్యూ కార్లను ఎక్కువగా అమ్మింది.

    తరువాతి స్థానంలో టాటా మోటార్స్ నిలిచింది. సుమారు 46, 070 కార్లను విక్రయించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అయితే గతేడాదితో పోలిస్తే చాలా తక్కువగా వృద్ధి శాతాన్ని నమోదు చేసుకుందని తెలుస్తోంది.

    ఇక నాలుగో స్థానంలో మహీంద్రా సంస్థ నిలిచింది. ఈ క్రమంలోనే ఈ నవంబర్ లో 39,981 కార్లను విక్రయించి నాలుగో ప్లేస్ కు చేరింది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం 31.6 శాతం వృద్ధిని సాధించడం విశేషం.

    అలాగే ఐదో స్థానంలో కియా మోటార్స్ నిలిచింది. 22,762 కార్లు అమ్ముడుపోగా పోయిన సంవత్సరంలో పోలిస్తే కియా మోటార్స్ కార్ల సేల్స్ క్షీణించాయి. అయితే రానున్న రోజుల్లో కియా మోటార్స్ వెహికల్స్ సేల్స్ పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.