https://oktelugu.com/

Best Car: మిడిల్ క్లాస్ బడ్జెట్ లో వచ్చే బెస్ట్ కారు ఇదే.. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

తాజాగా టయోటా కంపెనీ రుమానియా ఎంపీవీ కారును విడుదల చేసింది. ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండడంతో పాటు ధర కూడా ఆకట్టుకుంటోది. మరి ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : October 9, 2023 / 03:08 PM IST
    Follow us on

    రోజురోజుకు కార్ల వినియోగం పెరుగుతున్నాయి. వినియోగదారుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. పండుగల సీజన్ సందర్భంగా కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా టయోటా కంపెనీ రుమానియా ఎంపీవీ కారును విడుదల చేసింది. ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండడంతో పాటు ధర కూడా ఆకట్టుకుంటోది. మరి ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..

    కార్లు కొనాలనుకునే చాలా మంది ఇటీవల మైలేజ్ ను ఎక్కువగా ఆశిస్తున్నారు. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో టయోటా కంపెనీ రుమియన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు 1.5 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 75.8 కిలో వాట్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 136.8 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ కారు లీటర్ కు 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫఓర్స్ డిస్ట్రిబ్యూషన్, ఇంజిన్ ఇమొ్మబిలైజర్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఈఎస్ పీ, హిల్ హోల్డ్ తో పాటు యాంటీ లాక్ బ్రక్ సిస్టమ్ వంటి పీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 17.78 సెంటిమీటర్ల స్మార్ట్ ప్లే కాస్ట్ టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్, 55 ప్లస్ ఫీచర్లతో టయోటా ఐ కనెక్ట్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, లాక్ స్మార్ట్ వాచ్ అనుకూలత వంటి ఫీచర్లు ఉన్నాయి.

    ఇక రూమియన్ కారును తక్కువ ధరకే అందించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు రూ.8 లక్షల ఎక్స్ షోరూం ధరతో విక్రయించాలని నిర్ణయించారు. ఎంపీవీలో తక్కువ బడ్జెట్ లో కారు కొనుగోలు చేయానుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఎంపిక చేసుకోవచ్చని కార్ల ప్రతినిధులు చెబుతున్నారు. ఇతర ప్రీమియం కార్ల వలె ఫీచర్లు ఉన్నా.. మిడిల్ క్లాస్ పీపుల్స్ బడ్జెట్ కు అనుగుణంగా ఈ కారును విక్రయిస్తున్నట్లు టయోటా ప్రతినిధులు చెబుతున్నారు.