Young Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడం కోసం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ జనరేషన్ లో ఉన్న చాలామంది హీరోలు విభిన్నమైన కథలతో వాళ్ల కంటు ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకుంటు ముందుకు దూసుకెళ్తున్నారు. తెలుగులో చాలా ప్రయోగత్మకమైన సినిమాలు చేస్తున్న హీరోలలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు.ఈయన మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ వాటితో సక్సెస్ రాకపోవడం తో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ ని ఎంచుకొని సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే ఈయనకి వరుస విజయాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈయన స్వామి రారా సినిమాతో ఒక మంచి సూపర్ హిట్ సాధించడంతో ఆ సినిమా తర్వాత కార్తికేయ సినిమాతో మరో సక్సెస్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక అందులో భాగంగానే సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ 2 , స్పైలాంటి కొత్త తరహా సినిమాలను చేస్తూ డిఫరెంట్ సినిమాలు చేసే హీరోగా తనని తాను ఇండస్ట్రీ లో ప్రజెంట్ చేసుకున్నాడు…ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాలతోనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు స్టార్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ఇండస్ట్రీలో ఒక కొత్త కథను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు…
అడవి శేషు
ఈయన కూడా మొదట సైడ్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో క్షణం లాంటి సినిమాతో థ్రిల్లర్ జానర్ ని ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఆ తర్వాత ఆయన గూడచారి,ఎవరు, హిట్ 2 లాంటి సినిమాలతో ఆయన స్థాయిని పెంచుకున్నాడు. ఇలా ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో చేసి తన స్టాండర్డ్ ఏంటో ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి తెలిసేలా చేశాడు…
ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో వీళ్లిద్దరు మాత్రమే చాలా డిఫరెంట్ సినిమాలను ఎంచుకొని డిఫరెంట్ క్యారెక్టర్లలో నటిస్తూ సక్సెస్ లు కొడుతూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వీళ్లు కనక ఇదే దారిలో ముందుకెళ్తే స్టార్ హీరోలు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి….