Maruti Jimny : మారుతి కంపెనీ నుంచి వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కంపెనీ ఎన్నికార్లు మార్కెట్లోకి వచ్చినా కొన్ని మోడళ్లపై క్రేజ్ తగ్గకుండా ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో మిగతా కంపెనీలతో పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షించే విధంగా కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లను తీసుకొచ్చిన మారుతి మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిన్ ఎస్ యూవీ థార్ కు పోటీగా మారుతి జిమ్నీని రోడ్లపై తిప్పుతోది. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగ ఉండడంతో పాటు ఇంజిన్, పీచర్ల విషయంలో థార్ తో పోటీ పడుతోంది. దీంతో చాలా మంది మారుతి కార్ లవర్స్ జిమ్నీని కొనుగోలు చేశారు. అయితే ఎస్ యూవీ కారు అయినందున జిమ్నిని కాస్త ఎక్కువ ధరతోనే విక్రయించారు. కానీ ఇటీవల దీని సేల్స్ పెంచడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కారుపై భారీ తగ్గింపు ధరను ప్రకటించారు. మారుతి జిమ్నీ కావాలని ఇన్నిరోజులు ఆశ పడ్డవారు ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చని అనుకుంటున్నారు. అయితే మారుతి జిమ్ని మాత్రమే కాకుండా బాలెనో, సుజుకీ ఫ్రాంక్స్ వంటి కార్లపై భారీ తగ్గింపు ధరను ప్రటించారు. అయితే ఇవి ఆయా ప్రాంతాలను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఇంతకీ మారుతి జిమ్ని ధర ఎలా ఉంది? దీనిపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు?
ప్రస్తుతం కారు కొనాలనుకునేవారు ఎస్ యూవీలను ఎక్కువగా కోరుకుంటున్నారు. మిగతా కార్ల కంటే ఇవి విశాలమైన స్పేస్ తో పాటు ఇంజిన్ సైతం అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ తరుణంలో మహీంద్రా కంపెనీ ఎస్ యూవీలను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మహీంద్రా నుంచి రిలీజ్ అయిన థార్ ను అత్యధికంగా కొనుగోలు చేశారు. ఈకారును ఓ సమయంలో ఎదురే లేదని అనుకున్నారు. కానీ మారుతి కంపెనీ దీనికి గట్టి పోటీ ఇచ్చేందుకు జిమ్నీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది గత ఏడాది మార్కెట్లోకి వచ్చినా అమ్మకాల్లో ముందు వరుసలో ఉంది. అయితే ఈ కారు అమ్మకాలు మరింత ప్రోత్సహించేందుకు ఇటీవల భారీ ఆఫర్స్ ప్రకటించారు.
SUV వేరియంట్ లో ఉన్న మారుతి జిమ్నీ 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 105 బీహెచ్ పీ పవర్ తో పాటు 134 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. జిమ్ని ధర ప్రస్తుతం మార్కెట్లో 14.79 లక్షల ప్రారంభ ధరతో ఉంది. ఇది ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఈ కారుపై ఇప్పుడు ఏకంగా రూ. 3.3 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. ఇందులో రూ.80 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంది. అయతే 1.8 లక్షల వరకు టాప్ ఎండ్ వేరియంట్ పై డిస్కౌంట్ ను ఇస్తున్నారు. ఫైనాన్స్ ద్వారా కారును కొనుగోలు చేస్తే మరో రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది. ఇలా మొత్తం రూ.3 లక్షలకు పైగా జిమ్నీ ద్వారా డిస్కౌంట్ ను పొందవచ్చు.
మారుతి నుంచి రిలీజ్ అయిన జిమ్ని మాత్రమే కాకుండా సుజుకీ ఫ్రాంక్స్ కారుపై తగ్గింపు ధరను ప్రకటించారు. ఈ కారుపై రూ.85 వేల క్యాష్ డిస్కౌంట్ ను ప్రకటించారు. బాలెనో ఆధారిత క్రాస్ ఓవర్ ఎస్ యూవీపై ఇదే మొత్తంలో ఆఫర్ ను ప్రకటించారు.