Gold – Silver Rates : కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను మంగళవారం(జూలై 23న) ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 8 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మొత్తం విలువ రూ. 32.07 లక్షల కోట్లు. బడ్జెట్ ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 750 పాయింట్లు తగ్గగా, నిఫ్టికీ కూడా అదె బాటలో పయనించింది. ఇక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించి నిర్ణయాలతో బంగారం, వెండి దరలు కూడా దిగివచ్చాయ.
దేశంలో బంగారం ధరలు కొన్నేళ్లుగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏటేటా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్య తరగతి ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బంగారం ఇప్పుడు సంపన్నుల ఇళ్లకే చేరుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో తీపికబురు చెప్పారు. బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ 6.4 శాతం తగ్గిస్తామని తెలిపారు. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టి రోజే దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి రూ.67,600కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు ధర 10 గ్రాములకు రూ. 73,730కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.73,580కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 67,450కు చేరింది. ఇక వెండి ధరలు చూస్తే కిలోకు రూ.400 వరకు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,100కు చేరుకుంది.
నిల్వలు తగ్గించుకునేందుకే..
బంగారం, వెండి నిల్వలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వద్ద పెరిగిపోయాయి.. మన దేశానికి చెందిన బంగారం నిల్వలు విదేశాల్లోనూ ఉన్నాయి. వాటిని తగ్గించాలనే యోచనతోనే కేంద్రంలోని మోదీ సర్కార్ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించినటు‍్ల తెలుస్తోంది. ధరల స్థిరీకరణ కోసమే మోదీ ఈ ప్లాన్ చేసినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
బంగారం ఖరీదైనది
బంగారం ఫ్యూచర్స్ ధరలు మంగళవారం పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం బెంచ్‌మార్క్ ఆగస్టు కాంట్రాక్ట్ ఈరోజు రూ.120 పెరిగి రూ.72,838 వద్ద ప్రారంభమైంది. రూ. 100 పెరుగుదలతో రూ. 72,818 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,850 వద్ద రోజు గరిష్టాన్ని తాకగా, రూ.72,809 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. బంగారం ఫ్యూచర్స్ ధర ఈ నెలలో అత్యధికంగా రూ.74,471కి చేరుకుంది.
సిల్వర్ ఫ్యూచర్స్
ఇక సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు మంగళవారం మందకొడిగా ప్రారంభమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి బెంచ్‌మార్క్ సెప్టెంబర్ కాంట్రాక్ట్ ఈరోజు రూ.205 పతనంతో రూ.88,995 వద్ద ప్రారంభమైంది. రూ.213 పతనంతో రూ.88,990 వద్ద ట్రేడ్ అయింది. రూ.89,015 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ.88,971 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాది వెండి ఫ్యూచర్స్ ధర అత్యధికంగా రూ.96,493కి చేరుకుంది.