https://oktelugu.com/

Royal Enfield : రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బైక్.. డిజైన్ ఫిదా.. ఫీచర్స్ కేక.. ధర ఎంతో తెలుసా?

కొత్తగా మార్కెట్లోకి వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ గెరిలా్ల 450 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్ ఉంది. ఇది 40.02 బీహెచ్ పీ పవర్ తో పాటు 40 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో ఎల్ ఈడీ హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఫోన్ కనెక్టివిటీ తో కూడిన డిస్ ప్లే, గూగుల్ మ్యాప్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్, యూఎస్ బీ సీ ఫోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి

Written By:
  • Srinivas
  • , Updated On : July 23, 2024 8:18 pm
    Follow us on

    Royal Enfield : మిడిల్ క్లాస్ పీపుల్స్ ప్రయాణాలు చేయడానికి అనువైన వాహన టూ వీలర్. ఒకప్పుడు ద్విచక్రవాహనం కలిగి ఉన్న వారు గొప్పగా ఫీలయ్యేవారు. కానీ రాను రాను చాలా కంపెనీలు వివిధ కంపెనీలు వివిధ బైక్ లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే మార్కెట్లోకి ఎన్ని ద్విచక్ర వాహనాలు వచ్చినా Royal Enfileldకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. స్టైలిష్ గా ఉండాలనుకునేవారు ఈ బైక్ ను ఎక్కువగా కోరుకుంటారు. దీని ధర ఎక్కువైనా ఏమాత్రం ఆలోచింకుండా దానిని సొంతం చేసుకుంటారు. అయితే రాయల్డ్ ఎన్ ఫీల్డ్ నుంచి ఇప్పటికే చాలా మోడళ్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను అలరించాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతున్న కొద్దీ లేటేస్ట్ టెక్నాలజీతో కొత్త బైక్ లు అవతరిస్తున్నాయి. లేటేస్ట్ గా Royal Enfileld గెరిల్లా 450 మార్కెట్లోకి వచ్చింది. ఇది ప్రస్తుతం మెట్రో నగరాల్లోనే అందుబాటులో ఉంది. బైక్ పనితీరు, అమ్మకాలను బట్టి మిగతా నగరాల్లో విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన బైక్ లకు తీసిపోని విధంగా ధర, ఫీచర్స్ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. అంతేకాకుండా దీని లుక్ కూడా అదిరిపోయే విధంగా ఆకట్టుకుంటోంది. ఇలాంటి బైక్ గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. మరి రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్తగా వచ్చిన గెరిల్లా 450 ధర, ఫీచర్స్, మార్కెట్ పరిస్థితి గురించి వివరాల్లోకి వెళ్దామా..

    కొత్తగా మార్కెట్లోకి వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ గెరిలా్ల 450 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్ ఉంది. ఇది 40.02 బీహెచ్ పీ పవర్ తో పాటు 40 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో ఎల్ ఈడీ హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఫోన్ కనెక్టివిటీ తో కూడిన డిస్ ప్లే, గూగుల్ మ్యాప్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్, యూఎస్ బీ సీ ఫోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు స్వూప్ ఆఫ్ సీటు, టియర్ డ్రాప్ ఇంజిన్ డ్యాక్, స్లిమ్ టెయిల్ సెక్స్ తో కూడిన రెట్రో రోడ్ స్టర్ థీమ్ వంటి పీచర్లు ఉన్నాయి. ఈ బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు డబులు పిస్టన్ కాలిఫర్ ను అమర్చారు. అలాగే 310 మిమీ వెంటిలేటెడ్ డిస్క్ తో పాటు సింగిల్ పిస్టిన్ కాలిఫర్ వెంటిలేటెడ్ డిస్క్ ను అమర్చారు.

    రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి నిత్యం కొత్త మోడళ్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తూ ఉంటారు. వారికి అనుగుణంగా లేటేస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ తో గెరిల్లాను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే దీనిని ముందుగా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఢిల్లీలో గెరిల్లా ను రూ. 2.97 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో రూ.3.07లక్షలతో విక్రయిస్తున్నారు. ఇది మొత్త మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఒకటి అన లాగ్, డాస్, ఫ్లాష్ ఉన్నాయి. వినియోగదారులు ఎంచుకున్న వేరియంట్ ను బట్టి ధర మారుతూ ఉంటుంది. వీటిలో అత్యధికంగా ఫ్లాష్ అత్యధికంగా రూ.2.54 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇది హైదరాబాద్ లో మారే అవకాశం ఉంది. కొత్తగా రాయ్ ఎన్ ఫీల్డ్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది బెస్ట్ బైక్ అని కొందరు టూవీలర్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇది 140 ఎంఎం ట్రావెల్ తో 43 ఎంఎం టెలిస్కోప్ ఫ్రంట్ ఫోర్క్ లతో వినియోగదారులు మంచి అనుభూతి పొందుతారని అంటున్నారు.