Jagan: ఆరు రీజియన్లు.. ఐదు రెడ్డి సామాజిక వర్గానికే.. ఇవేం పదవుల పంపకం జగన్?

రాజకీయాలు ఎప్పుడు సామాజిక వర్గ సమీకరణల మీదే నడుస్తాయి.ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది నిజం. అయితే అధికారంలో ఉన్నన్నాళ్లు బీసీ నినాదాన్ని అందుకున్నారు జగన్.పదవి పోయేసరికి మళ్లీ సొంతవారు గుర్తుకొచ్చారు.

Written By: Dharma, Updated On : October 17, 2024 3:12 pm

YS Jaganmohan Reddy

Follow us on

Jagan: అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు బీసీ మంత్రాన్ని పఠించారు. బీసీలకు పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టారు. వారికోసం కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఇవేవీ ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు. భారీ ఓటమి ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన జగన్.. బీసీ నినాదాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.కేవలం జగన్ బీసీ నినాదాన్ని తెరపైకి తేవడం.. ఇతర వర్గాలను అందలం ఎక్కించడం.. తదితర కారణాలతో రెడ్డి సామాజిక వర్గం జగన్ కు దూరం అయింది. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం అనేది జగన్ కు పని చేయలేదు. గత ఐదేళ్ల పరిణామాలను గమనించిన రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ అయింది.గత రెండు ఎన్నికల మాదిరిగా చురుగ్గా పనిచేయలేదు. దాని ప్రభావమే ఈ ఘోర ఓటమి. అందుకే జగన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వైసిపి ప్రక్షాళనకు దిగారు. రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా విభజించి.. తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఒక్క బొత్సకు మాత్రం ఉభయగోదావరి జిల్లాలను విడిచిపెట్టారు. అక్కడ జనసేన ప్రభావం అధికంగా ఉండడం, కాపులు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపడం, వంటి కారణాలతో బొత్సను అక్కడ బాధ్యతలు అప్పగించారు జగన్.

* వారిని అటు ఇటు చేసి
ఇటీవల పార్టీలో చేర్పులు మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా రీజనల్ కోఆర్డినేటర్లను మార్చారు. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి నియమించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను అప్పగించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలనుఎంపీ మిధున్ రెడ్డి చేతిలో పెట్టారు.కృష్ణాజిల్లా బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి అప్పగించారు.చిత్తూరు, నెల్లూరు జిల్లా బాధ్యతలను మాత్రం సీనియర్ నేత పెద్దిరెడ్డికి అప్పగించారు జగన్. ఆరు రీజియన్లుగా విభజించి పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. అందులో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం విశేషం.ఒక్క ఉభయగోదావరి జిల్లాలకు మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణకు బాధ్యతలు ఇచ్చారు.

* అప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి
అయితే పార్టీలో సామాజిక న్యాయం కోరుకుంటున్న వారు అధికం.గతంలో కూడా చిన్నచిన్న పదవులను వెనుకబడిన వర్గాలకు ఇచ్చి.. వారిపై పెత్తనం చేసే బాధ్యతలను,పదవులను తనవారికి అప్పగించారు. ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్లు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఉన్నారు. వారిపై విజయసాయి రెడ్డి లాంటి నేతను వేస్తే వారికి అవమానం కాదా. ఇప్పుడు రీజినల్ కోఆర్డినేటర్లుగా నియమించిన వారికి మించి సీనియర్లు వైసీపీలో ఉన్నారు. అందులో రాజశేఖరరెడ్డికి సమకాలీకులు సైతం ఉన్నారు. మళ్లీ చేసిన తప్పిదమే మళ్లీ మళ్లీ చేస్తూ జగన్ పార్టీ పరిస్థితి మరింత దిగజారుస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఉన్నంతసేపు సొంత సామాజిక వర్గంలో ఆ నలుగురికి ప్రాధాన్యమిచ్చారు.ఇప్పుడు కూడా అదే నలుగురిని పట్టుకుని వేలాడుతున్నారు. ఇలా అయితే కష్టమని సీనియర్లు నిట్టూర్చుతున్నారు.