Best Selling Cars: ఒకప్పుడు దూర ప్రయాణాలు చేయడానికి మాత్రమే కారు వాడే వారు. కానీ ఇప్పుడు చాలా మంది నిత్యావసరంలో భాగంగా కారు ఉండాలని అనుకుంటారు. ఆదాయం పెరిగినా, పెరగకున్నా.. కొన్ని అవసరాల నిమిత్తం ఇతర వాహనాలపై ఆధారపడడం కంటే సొంతంగా కారు ఉండడం మేలని భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలం తరువాత చాలా మంది కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్ల సేల్స్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు కార్ల సేల్స్ 4.9 శాతం పెరిగినట్లు ఇండియన్ ఆటోమోబైల్ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అంటే మొత్తం 2,94, 233 కార్లు సేల్స్ అయినట్లు తెలుస్తోంది. వీటిలో జూలై నెలలోనే ఎక్కువగా కార్లు మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ లతో పాటు విద్యుత్ కార్లు మార్కెట్లోకి వస్తున్నారు. ఈ తరుణంలో వినియోగదారులు తమకు నచ్చిన వేరియంట్ ను సొంతం చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఎస్ యూవీ విభాగంలోనే ఎక్కువగా సేల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇన్నర్ స్పేసియస్ ఎక్కువగా ఉండి, ఇంజిన్ పనితీరులో మార్పు ఉండడంతో పాటు ధర కూడా తక్కువగా ఉండడంతో వేరియంట్ పై మోజు పెంచుకుంటున్నారు. వీటితో పాటు విద్యుత్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే జూలై నెలలో ఏ కారు టాప్ లెవల్లో ఉంది? ఎన్ని యూనిట్లు అమ్ముడు పోయాయి? ఆ వివరాలు కోసం ఈ కిందికి వెళ్లండి..
కార్ల సేల్స్ లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. కొన్ని కార్లను సేల్స్ చేయడంలో భారత్ ముందు ఉంటుంది. అందుకు జూలై అమ్మకాలే నిదర్శనం అని ఆటోమోబైల్ నిపుణులు పేర్కొంటున్నారు. జూలై నెలలో ఎక్కవగా కార్లు అమ్మిన కంపెనీల్లో హ్యుందాయ్, మారుతి ఇతర కంపెనీలు ఉన్నాయి. హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన క్రెటాను అత్యధిక వినియోగదారులు కోరుకున్నారు.ఎస్ యూవీ వేరియంట్ లో ఇది బెస్ట్ కారుగా నిలిచింది. ఈ కారు జూలై నెలలో 14,062 యూనిట్లు అమ్ముడు పోయింది. జనవరి నుంచి జూలై వరకు ఈ కారు 23.38 శాతం అమ్మకాల్లో వృద్ధి సాధించింది. ఈ కారు ధర రూ.11 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
ఆ తరువాత మారుతి కంపెనీకి చెందిన హ్యాచ్ బ్యాక్ కారు స్విప్ట్ మరోసారి టాప్ లెవల్లో నిలిచింది. దశాబ్దాలుగా స్విప్ట్ కారును కోరుకుంటున్నారు. ఇది మార్కెట్లోకి కొత్త వెర్షన్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది 16,854 యూనిట్లు అమ్ముడు పోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 5.82 వృద్ధి సాధించింది. దీనిని రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనికి చెందిన వ్యాగన్ ఆర్ బెస్ట్ సేల్స్ లో మూడో స్థానంలో నిలిచింది. జూలైలో 16,191 వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడుపోయాయి. గత ఏడాదితో పోలిస్తే దీని వృద్ధి రేటు 24.83 శాతంగా ఉంది. దీనిని రూ.5.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
జూలై కార్ల విక్రయాల్లో టాప్ 4వ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. ఇది ఎలక్ట్రిక్ కార్ విభాగంలో టాప్ లో ఉంది. దీనిని జూలైలో 16,121 మంది సొంతం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 34.13 వృద్ధి సాధించింది. ఈ మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫ్యూయెల్ వేరియంట్ ను రూ.6.13 లక్షలతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ రూ.15.49 లక్షల వరకు విక్రయించనున్నారు.
ఎప్పటి లాగే మారుతికి చెందిన ఎర్టీగా అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి. దీంతో జూలై నెలలో ఈ కారు టాప్ 5లో నిలిచింది. దీనిని జూలైలో 15,701 మంది సొంతం చేసుకున్నారు. ఈ కారును రూ.8.69 నుంచి రూ. 13.03 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More