Naga Chaitanya: నాగ చైతన్య 2017లో హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వారి వివాహం జరిగింది. సమంత-నాగ చైతన్య టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. కారణం తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2021 ప్రారంభంలో వీరు విడిపోయారు. వేరుగా ఉంటున్నారన్న విషయం తెలిశాక విడాకుల రూమర్స్ తెరపైకి వచ్చాయి. 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.
అప్పటి నుండి సమంత ఒంటరిగా ఉంటుంది. అయితే నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నారనే పుకార్లు తెరపైకి వచ్చాయి. నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటికి తరచుగా శోభిత ధూళిపాళ్లతో వెళ్లేవాడట. శోభిత-నాగ చైతన్య ప్రేమలో పడ్డారనే వాదన చాలా కాలంగా ఉంది. వీరిద్దరూ తరచుగా విదేశాలకు వెళతారట. విదేశాల్లో వీరు జంటగా ఉన్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. అయితే నాగ చైతన్య టీం ఈ వార్తలను ఖండించారు.
కొన్నాళ్ల క్రితం లండన్ లో నాగ చైతన్య-శోభిత కనిపించారు. ఓ రెస్టారెంట్ చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగి దాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో దూరంగా ఉన్న శోభిత సైతం కవర్ అయ్యింది. సదరు ఫోటో వైరల్ కావడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. వెంటనే ఆ చెఫ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోటో తొలగించాడు. అప్పటికే ఆ ఫోటో మీడియా సంస్థలు ప్రచురించాయి. దాంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. శోభిత-నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారని కథనాలు వస్తున్నా.. నాగ చైతన్య స్పందించలేదు.
కాగా నేడు శోభిత-నాగ చైతన్య నిశ్చితార్థం జరుపుకుంటున్నారట. ఈ వేడుక నాగార్జున నివాసంలో జరగనుందట. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారట. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరీ శోభిత అనే ఆసక్తి అందరిలో పెరిగింది. అక్కినేని ఇంటికి కోడలుగా వెళుతున్న శోభిత తెలుగు అమ్మాయినే. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన అమ్మాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.
విశాఖపట్నం, ముంబై నగరాల్లో ఆమె చదువుకుంది. 2016లో శోభిత సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. రామన్ రాఘవ్ 2.0 అనే హిందీ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం గూఢచారి. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో శోభిత నటించడం విశేషం. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో సైతం శోభిత నటించింది. ప్రస్తుతం సితార టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది.
నాగ చైతన్య-శోభిత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం పరాజయాల్లో ఉన్నాడు. ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. తండేల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. చందూ మొండేటి దర్శకుడు.