Maharashtra Bandh 2024 : మహారాష్ట్ర అట్టుడికి పోతోంది.. ఆరోజు బంద్ కాల్.. ఆ రోజు ఏం జరగబోతోంది..?

ఆగస్ట్ 24న మహారాష్ట్ర బంద్ కారణంగా ఆ రోజు స్కూల్స్, కాలేజీలకు యాజమాన్యం సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తెరుస్తారా? లేదంటే మూసివేస్తారా? అనేది తెలియలేదు. కాబట్టి తెరిచి ఉంటాయని కొందరు నిర్వాహకులు చెప్తున్నారు. సాధారణంగా శనివారాల్లో మూతపడే సంస్థలు మూసివేయనున్నారు.

Written By: NARESH, Updated On : August 23, 2024 3:15 pm

Badlapur School Incident

Follow us on

Maharashtra Bandh 2024 : కోల్ కత్తా ఆర్జికర్ హాస్పిటల్ ఉదంతం కొనసాగుతున్న సమయంలోనే బద్లాపూర్ ఘటన బయటకు వచ్చింది. ఈ వేడిలో ఇది సంచలనంగా మారింది. రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని వాటిని నివారించడంలో ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రంలోని విపక్షాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మహా‘బంద్’కు పిలుపునిచ్చాయి. అయితే ఈ బంద్ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని మాత్రం విపక్షాలు పిలుపునిచ్చాయి.

థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు యువతులపై జరిగిన లైంగిక దాడిని నిరసిస్తూ మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆగస్ట్ 24న ‘మహారాష్ట్ర బంద్’కు పిలుపునిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై బుధవారం (ఆగస్ట్ 21) జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంవీఏ మిత్రపక్షాలు – కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)ఈ బంద్ కు మద్దతిస్తున్నాయి. ఈ ఘటనతో మహారాష్ట్ర ప్రజలు కలత చెందారని, ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. బద్లాపూర్ ఘటనకు నిరసనగా ఆగస్ట్ 24న మహారాష్ట్ర బంద్ కు ఎంవీఏ పిలుపునిస్తుందని తెలిపారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమని ఎన్సీపీ-ఎస్సీపీ నేత జితేంద్ర అవద్ వ్యాఖ్యానించారు. నేర కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర బంద్ అనివార్యం అన్నారు. బద్లాపూర్ ఘటన నేపథ్యంలోనే 24న బంద్ కు తాము సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ తెలిపారు.

ఆగస్ట్ 24న మహారాష్ట్ర బంద్ కారణంగా ఆ రోజు స్కూల్స్, కాలేజీలకు యాజమాన్యం సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తెరుస్తారా? లేదంటే మూసివేస్తారా? అనేది తెలియలేదు. కాబట్టి తెరిచి ఉంటాయని కొందరు నిర్వాహకులు చెప్తున్నారు. సాధారణంగా శనివారాల్లో మూతపడే సంస్థలు మూసివేయనున్నారు.

విపక్షాలు పిలుపునిచ్చిన బంద్ కు మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. కాబట్టి ప్రజా రవాణా అయితన బస్సులు, మెట్రో రైల్స్ యధావిధిగా నడుస్తాయని అందరూ భావిస్తున్నారు. ఎంవీఏ పిలుపునిచ్చిన మహారాష్ట్ర బంద్ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ పాఠశాలల్లో బాలికల భద్రతపై ఇలాంటి ఘటనలు ఆందోళనను పెంచుతున్నాయి. మహావికాస్ అఘాడీ మాత్రమే కాకుండా ప్రజలంతా బలపరిచిన ఈ బంద్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. బస్సులు, రైల్ సర్వీసులను కూడా నిలిపివేయాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. కులం, మతంతో సంబంధం లేకుండా మీ ఆడబిడ్డలు, సోదరీమణుల భద్రత కోసం బంద్ లో పాల్గొనండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

బ్యాంకులు పని చేస్తాయా?
24వ తేదీ శనివారం కావడంతో దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెండు, నాలుగో శని, ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు కాబట్టి ఆ రోజు సాధారణంగానే బ్యాంకులు మూసి ఉంటాయి.

బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు..
బద్లాపూర్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఆగస్ట్ 17న ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన అటెండర్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బద్లాపూర్ రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపి పోలీసులపై రాళ్లు విసిరారు. మంగళవారం రైలు సేవలకు అంతరాయం కలిగించడం, రాళ్లు రువ్విన 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 300 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.