SUV Cars: కొత్త ఏడాదిలో రిలీజ్ అయ్యే SUVలు ఇవే..

కొరియన్ కు చెందిన కంపెనీ కియా దేశీయ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా సోనెట్ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే గత డిసెంబర్ లో కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసింది.

Written By: Srinivas, Updated On : January 6, 2024 2:56 pm

Suv Cars

Follow us on

Suv Cars: భారతీయ ఆటోమోబైల్ రంగంలో 2024 సరికొత్త విప్లవం సృష్టించే అవకాశం ఉందా? అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది కార్ల కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. వివిధ వేరియంట్లను పరిచయం చేస్తూ ఫీచర్స్ ను అప్డేట్ చేస్తున్నారు.వినియోగదారుల అభిరుచులు, వారి అవసరాల నేపథ్యంలో కొత్త సౌకర్యాలు కల్పిస్తూ ఆకర్షిస్తున్నాయి. మొన్నటి వరకు చాలా మంది హ్యాచ్ బ్యాక్ కార్ల కోసం ఎదురుచూసినవారు ఇప్పుడంతా ఎస్ యూవీలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. విశాలమైన స్సేస్ తో పాటు డబుల్ ఇంజిన్ కలిగిన వాటి కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు కొత్త ఏడాది సందర్భంగా కొత్త ఎస్ యూవీలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

కొరియన్ కు చెందిన కంపెనీ కియా దేశీయ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా సోనెట్ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే గత డిసెంబర్ లో కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసింది. దీంతో చాలా మంది బుకింగ్ చేసుకున్నారు. కొత్త ఏడాదిలో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఎస్ యూవీ అయిన సోనెట్ ఫేస్ లిప్ట్ లో కొత్త ఎల్ ఈడీ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్నాయి. ఎల్ ఈడీ లైట్స్ కనెక్ట్ చేయబడిన లైట్ బార్లు ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ యాడ్ చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు కలిగిన ఇది 7 వేరియంట్లలో లభిస్తుంది.

మరో కంపెనీ హ్యూందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ను కూడా కొత్త ఏడాదిలో ప్రారంభించనున్నారు. సరికొత్త ఎస్ యూవీ క్రెటాలో సేప్టీ ఫీచర్స్ ను ఎక్కువగా యాడ్ చేశారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, టైర్రా ప్రెజర్ మానిటరింగ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ లు, ఎలాక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లేటేస్ట్ ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎటువంటి ప్రమాదాలనైనా తట్టుకునే విధంగా దీని బాడిని తయారు చేశారు. అలాగే ఆకర్షణీయమైన డిజైన్ తో ఇది అలరిస్తుంది.

2024లో రిలీజ్ అయ్యే మరో ఎస్ యూవీ మెర్సిడెస్ జీఎల్ ఎస్ ఫేస్ లిఫ్ట్. దీనిని జనవరి 8న లాంచ చేయనున్నట్ల ప్రకటించారు. 2999 సీసీ ఇంజిన్ పవర్ తో పాటు పెట్రోల్ వేరియంట్ లో లభించనుంది. అయితే దీని ధర, ఇతర వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడించలేదు. మొత్తంగా ఈ ఏడాదిలో కొత్త ఎస్ యూవీలను రిలీజ్ చేసే అవకాశం ఉన్నందున కారు ప్రియులు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే కొత్త కారును కొనాలనుకునేవారు సైతం వీటిపై దృష్టి పెడుతున్నారు.