https://oktelugu.com/

Sai Dharam Tej: గొంతుపై మానని గాయాలు.. సాయి ధరమ్ తేజ్ ఇంకా బాధ పడుతున్నారా?

మాదాపూర్ లో తేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరగడంతో కొద్ది రోజులు కోమాలో కూడా ఉన్నారు. ఆరోగ్యం కోలుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 6, 2024 / 02:59 PM IST

    Sai Dharam Tej

    Follow us on

    Sai Dharam Tej: మెగా కుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. ఈయన నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బైక్ యాక్సిడెంట్ జరిగి అందరిని ఏడిపించాడు. ఈయన కోసం ఎంతో మంది అభిమానులు ఆస్పత్రికి తరలి వెళ్లారు. సాయి కోలుకోవాలని పూజలు కూడా చేశారు ఆయన అభిమానులు. బైక్ యాక్సిడెంట్ జరగడంతో చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.

    మాదాపూర్ లో తేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరగడంతో కొద్ది రోజులు కోమాలో కూడా ఉన్నారు. ఆరోగ్యం కోలుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ గతం మాదిరి సినిమాలు చేస్తున్నారు. హిట్ ను సాధిస్తున్నారు. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు సాయి. ప్రస్తుతం తన సినిమాలు, కంటెంట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయితే బైక్ యాక్సిడెంట్ తర్వాత ఈ హీరో లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయట. ముఖ్యంగా వాయిస్ మారిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట.

    రీసెంట్ గా తెలుగు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సాయి ఈ విషయాల గురించి వెల్లడించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్, శ్రుతి హాసన్, నిర్మాత శోభు, తరుణ్ భాస్కర్, శ్రియా రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాల గురించి తెలిపారు. జీవితం కిందకు నెట్టి పైకి లేపేందుకు దారి చూపుతుందన్నారు. ఇక విరూపాక్ష సక్సెస్ గురించి మాట్లాడుతూ సక్సెస్ కంటే యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించడం తన మీద ప్రేమ చూపించడం నచ్చిందన్నారు.

    తేజ్ గొంతుపై యాక్సిడెంట్ తాలూకు గుర్తులు కనిపించాయి. అంటే ఇంకా ఆ గాయాలతో బాధ పడుతున్నారు తేజ్. అందుకే ఒకప్పటిలా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారంటూ ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే సినిమాల్లో నటిస్తున్నప్పుడు మేకప్ తో ఈ గుర్తులు కవర్ అవుతుంటాయి. కానీ ఇంటర్య్వూలో ఈ జాగ్రత్త పాటించలేకపోయారు. అందుకే తేజ్ గొంతు మీద ఉన్న గాయాలను చూసి ఆయన అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అంతేకాదు ఈ గాయాలు ఎప్పుడు మానుతాయో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు.