New Car Launches In May: కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. మే నెలలో మార్కెట్లోకి వివిధ మోడళ్లు రాబోతున్నాయి. నిన్నటి వరకు అత్యధిక ధరలు ఉన్నా.. కొన్ని మోడళ్లు ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు మారుతి సుజుకి, బీఎండబ్ల్యూ, టాటా కంపెనీ కొత్త వాటిని విడుదల చేయడానికి రంగం సిద్దం చేసుకున్నాయి. వీటి వివరాలు ఆన్లైన్లో పెట్టడంవా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో ఏదో ఒకటి బుక్ చేసుకుంటున్నారు. మారుతి సుజుకీ నుంచి ఇప్పటికే ఎన్నో మోడళ్లు రాగా.. లేటేస్టుగా డిఫరెంట్ లుక్ లో రాబోతుంది. వాటి వివరాలేంటో తెలుసుకుందాం.
బీఎండబ్ల్యూ M2:
బీఎండబ్ల్యూ కారు ఎంత ఫేమసో అందరికీ తెలసిందే. ఇప్పుడు దీని నుంచి రెండో తరం M2(G87)ను రిలీజ్ చేయనున్నారు. విదేశాల్లో రూపుదిద్దుకున్న దీనిని లగ్జరీ కారు అని అనుకోవడానికి వీల్లేదు. ప్రామాణిక వేరియంట్ లో మాత్రమే వస్తుంది. దీని ఫీఛర్స్ పరిశీలిస్తే.. 3.0 లీటర్ ట్విన్ టర్బో ఇన్ లైన్ సిక్స్ ఇంజన్ ఉంది. 460 హార్స్ పవర్, 550 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఇందులో చూడొచ్చు. అయితే M2 ధర సుమారు రూ.కోటి రూపాయలు..
బీఎండబ్ల్యూ ఎక్స్ 3 ఎం40ఐ:
ఎక్స్ 3 కార్లలో హై పర్ఫార్మెన్స్ వేరియంట్ తో వస్తోంది బీఎండబ్ల్యూ ఎక్స్ 3 ఎం40ఐ. ఇది 3.0 లీటర్, 6 సిలిండర్, టర్బో -పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. 360 హార్స్ పవర్, 500 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న BMW M340i సెడాన్ తో దాని పవర్ ట్రెయిన్ ను పంచుకుంటుంది. స్పోర్ట్స్ స్టీరింగ్, ఎం స్పోర్ట్స్ బ్రేక్ లు, ఎం స్పోర్ట్స్ డిఫరెన్సియల్ దీని సొంతం. దీని ప్రారంభం ధర రూ.80 లక్షలు.
మారుతి సుజుకి జిమ్ని:
మారుతి సుజుకి నుంచి ‘జిప్సి’ ఎంతగానో ఆకట్టుకుంది. దీని వారసత్వంగా ‘జిమ్ని’ ని తయారు చేశారు. ఇది 1.5 లీటర్ కె15బి పెట్రోల్ ఇంజన్ ద్వారా 105 హార్స్ పవర్ ను కలిగిఉంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఉంది. భారత్ కోసం ప్రత్యేకంగా ఐదు డోర్ల బాడీ స్టైల్లోరూపు దిద్దుకుంది. దీని ఎక్స్ షో రూం ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది.
టాటా Altroz CNG:
CNGకి ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో టాటా కంపెనీ Altroz ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. సీఎన్ జీ మోడ్ లో 77 హార్స్ పరవ్, 97 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పెక్ ట్రిమ్ అల్లాయ్ వీల్స్, ఆటో ఏసీ, సన్ రూఫ్, ఆరు గెయిర్ బ్యాగులు ఇందులో ఉన్నాయి. ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్ లు అయ్యాయి. దీని ధర రూ.6 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.