EV cars : భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల హవా రోజురోజుకు పెరిగిపోతుంది. వినియోగదారులు ఎక్కువగా ఈవీ వెహికల్స్ కోరుకోవడంతో కంపెనీలు సైతం ఈ కార్లను ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఈవీలు ఎంట్రీ ఇచ్చి ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా కొన్ని కార్లు పోటీ పడి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్ని కార్లు మాత్రం అద్భుతం అని కార్లు వాడేవారు అంటున్నారు. మరి ఆ ఈవీలు ఏవో తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ కార్లలో కియా, టాటా, ఎంజీ, బీవైడీ, హ్యుందాయ్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వీటిలో టాటా కంపెనీకి చెందిన పంచ్ ఈవీ ఎక్కువగా ప్రజాదరణ పొందుతోంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 421 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. అలాగే 9.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టాటా పంచ్ ను 10.98 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కియా కంపెనీకి చెందిన ఎన్నో పెట్రోల్ కార్లు ఇప్పటికే అలరించాయి. ఇప్పుడు దీని నుంచి వచ్చిన ఈవీ 6 ఆకట్టుకుంటోంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ ఛార్జింగ్ 18 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు పూర్తవుతుంది.
హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 ఈవీ ఎస్ యూవీ వెరీ స్పెషల్ అంటున్నారు. దీనిని రూ.46.05 లక్షలతో విక్రయిస్తున్నారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 631 కిలోమీట్ల వరకు దూసుకెళ్లచ్చని అంటున్నారు. ఈ వెహికల్ కూడా 18 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఎంజీ కంపెనీకి చెందిన కామెట్ ఆవీ మార్కెట్లో కారు వినియోగదారులను అలరిస్తోంది. ఈ కారును 7.38 లక్షలతోనే విక్రయిస్తున్నారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. బీవైడీ కంపెనీ ఈవీ వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 570 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇది 3.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇవే కాకుండా మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.